గ్లాకోమా చికిత్సకు దారిచూపిన సీతాకోకచిలుక రెక్కలు

07-06-2018: గ్లాకోమా రోగులకు మరింత మెరుగైన చూపు అందించేందుకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలకు సీతాకోక చిలుక రెక్కలు దారి చూపించాయి. ఆ రెక్కల్లో ఉండే చిన్నపాటి అమరికల వల్ల కాంతి ఎలా ప్రసరిస్తుంది.. తిరిగి ఎలా ప్రకాశవంతంగా మారుతుంది అనే అంశం ఆధారంగా ‘ఉపరితల కాంతి అభిసంధానం’ను అభివృద్ధి చేశారు. దీనిని గ్లాకోమా రోగుల కంటిలో అమర్చడం వల్ల మెరుగైన చూపు వస్తుందని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు చెబుతున్నారు. వీరు చేసిన ప్రయోగం వివరాలను నేచుర్‌ నానోటెక్నాలజీ అనే జర్నల్‌లో ప్రచురించారు. సీతాకోక చిలుకలు ఏ విధంగా అయితే రెక్కలు ఆడించినప్పుడల్లా కాంతి ప్రసరణ ఎంత శక్తివంతంగా ఉందో.. కనురెప్పలు కొట్టుకొన్న ప్రతీసారి అదేవిధమైన ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.