కళ్ల కింద నల్లటి వలయాలు పోవాలంటే..

02-11-2018: కళ్ల కింద నల్లటి వలయాలు అందాన్ని తగ్గిస్తాయి. అయితే పాలు, సెనగపిండి పేస్ట్‌తో ఈ నల్లటి వలయాలను మాయం చేయవచ్చు. అందుకు రెండు టేబుల్‌ స్పూన్ల సెనగపిండిని తాజా పాలలో వేసి చిక్కని పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును నల్లటి వలయాల మీద రాసుకొని, ఆరిపోయాక చల్లటి నీళ్లతో కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఇలా చేస్తే కళ్ల కింది నల్లటి వలయాలు తగ్గిపోతాయి. పాలలోని విటమిన్‌ ఎ, విటమిన్‌ బి6 కొత్త చర్మం కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. పాలలోని విటమిన్‌ బి12 చర్మానికి సహజ రక్షణ కవచంగా పనిచేసి, కళ్ల కింది నల్లటి వలయాలను పోగొడుతుంది.