కళ్ల కింద వలయాలు

ఆంధ్రజ్యోతి, 30/01/2014: ఎక్కువగా మత్తుపానీయాలు సేవించినా, కాఫీ తాగినా ఇలా వలయాలు, ముడుతలు ఏర్పడడానికి అవకాశం ఉంది. శరీరంలో విటమిన్‌ బి 12 తగ్గినా, ఐరన్‌ తగ్గినా కళ్ల కింద చర్మం దెబ్బ తినడం మొదలవుతుంది. ఇలా వలయాలు, ముడుతలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రతించడం మంచిది. వీటిని నిర్లక్ష్యం చేయాడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇవి ముదిరాయంటే శరీరం విషమయం అయిపోతుంది. చికిత్స చాలా కష్టమవుతుంది. 

ఒక్కోసారి వారసత్వంగా కూడా కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. అలా కాకుండా అవి గనుక హఠాత్తుగా ప్రత్యక్షమయ్యే పక్షంలో అప్రమత్తం కావడం మంచిది. అవి కనిపించాయంటే మీ ఆరోగ్యం రాను రానూ క్షీణిస్తోందని అర్థం. కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చినా, చర్మం ముడుతలు పడుతున్నా, సంచుల లాగా ఏర్పడుతున్నా మీ మూత్రపిండాలు దెబ్బ తింటున్నాయని వెంటనే గ్రహించాలి. కళ్ల కింద చర్మం రంగు మారడం మొదలైందంటే, మీ మూత్రపిండాల్లో విషపదార్థాలు చేరుతున్నట్టు డాక్టర్లు అర్థం చేసుకుంటారు. మీ శరీరంలోని నీరు పూర్తిగా ఇంకిపోతున్నట్టు కూడా తెలుస్తుంది.
 
ఎక్కువగా మత్తుపానీయాలు సేవించినా, కాఫీ తాగినా ఇలా వలయాలు, ముడుతలు ఏర్పడడానికి అవకాశం ఉంది. శరీరంలో విటమిన్‌ బి 12 తగ్గినా, ఐరన్‌ తగ్గినా కళ్ల కింద చర్మం దెబ్బ తినడం మొదలవుతుంది. ఇలా వలయాలు, ముడుతలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రతించడం మంచిది. వీటిని నిర్లక్ష్యం చేయాడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇవి ముదిరాయంటే శరీరం విషమయం అయిపోతుంది. చికిత్స చాలా కష్టమవుతుంది. 
బుగ్గల మీద తెల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. బుగ్గలకు, చెవులకు మధ్య కూడా ఇవి కనిపిస్తుంటాయి. మీరు ఉపయోగిస్తున్న కాస్మటిక్స్‌ మంచివి కాకపోయినా, మీరు వాడుతున్న తలగడలు, దుప్పట్లు అపరిశుభ్రంగా ఉన్నా ఇలా తెల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇవి తీవ్రస్థాయి చర్మవ్యాధులేమీ కావు కానీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం రక్తం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇవి మరీ ఎక్కువగా ఉన్నా, ముఖమంతా వ్యాపిస్తున్నా వాటి ప్రభావం ఊపిరితిత్తుల మీద కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. మున్ముందు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు, అంటే ఉబ్బసం వంటివి, శరీరాన్ని పీడించే సూచనలున్నాయని ఇవి హెచ్చరిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. వెంటనే చర్మవ్యాధుల నిపుణుల్ని సంప్రతించడం మంచిది.
 
సరైన స్థానాల్లో ఉంటే పుట్టుమచ్చలు ఎంతో అందాన్నిస్తాయి. మూఢనమ్మకాల సంగతి పక్కనపెడితే, పుట్టుమచ్చలు ఎక్కడున్నా మంచిదేనని డాక్టర్లు చెబుతున్నారు. శరీరంలో ఎక్కువ పుట్టుమచ్చలున్నవారు చాలా ఆరోగ్యవంతులని వారు నిర్ధారించారు. ఇవి ఎక్కువగా ఉంటే ఎముకలు బాగా బలంగా, పుష్టిగా ఉన్నాయని అర్థం. పుట్టుమచ్చలు తక్కువగా ఉన్నవారికే ఎక్కువగా కీళ్ల నొప్పులు, ఎముకల సంబంధమైన వ్యాధులు వస్తుంటాయని డాక్టర్లు తేల్చి చెప్పారు. పుట్టు మచ్చలు కేవలం ఎముకలకు మాత్రమే పరిమితం కాలేదు. అవి ఎక్కువగా ఉంటే వాళ్ల కళ్లకూ మంచిది, వాళ్ల గుండెకూ మంచిదట. ఎడమ వైపున ఉన్నాయని పురుషులు, కుడి వైపున ఉన్నాయని మహిళలు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. అవి శరీరం మీద ఎవరికి ఎక్కడున్నా అదృష్టవంతులనే చెప్పాలి.