కృత్రిమ కన్నుతో ‘చూపు’

ఆంధ్రజ్యోతి, 20/10/2014: పుట్టుకతోనో, ప్రమాదాల మూలంగానో కలిగే అవయవలోపాన్ని సరిదిద్దేందుకు శాస్త్రవేత్తలు కృత్రిమ పరికరాలను తయారు చేస్తున్నారు. కృత్రిమ చేతులు, కాళ్లు తదితర అవయవాల మాదిరిగానే.. తాజాగా కృత్రిమ కన్నును అభివృద్ధి చేశారు. దీంతో రెటినిటిస్‌ పిగ్మెంటోసా వ్యాధితో కంటిచూపును కోల్పోయిన ఓ వృద్ధుడికి చూపు తెప్పించినట్లు డ్యూక్‌ ఐ సెంటర్‌ పరిశోధకులు పేర్కొన్నారు. కృత్రిమ కన్నుతో చూపు ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. ప్రత్యేకంగా తయారుచేసిన ఈ ‘బయోనిక్‌ ఐ’తో సాధ్యమేనని వారు జవాబిస్తున్నారు. ఈ కృత్రిమ కన్నులో కాంతిని గ్రహించేందుకు ఓ సెన్సార్‌ను అమర్చారు. అలాగే ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చిత్రించి, దాన్ని కాంతి తరంగాల రూపంలో ఈ సెన్సర్‌కు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా కెమెరాలను అమర్చిన కళ్లజోడును రూపొందించారు. ఆపై ఈ తరంగాలను సంకేతాల రూపంలో మెదడుకు చేర్చే పనిని కృత్రిమ కన్నులోని సెన్సర్‌ చేపడుతుంది. దీంతో ఈ కన్నును అమర్చిన వ్యక్తి ఎదుట ఉన్న వస్తువులను గుర్తించే శక్తి వస్తుందని అన్నారు.