విస్కీ నాణ్యతను గుర్తించే ‘కృత్రిమ నాలుక’

11-6-2017: విస్కీ రుచిని పరీక్షించి, దాని నాణ్యతను చెప్పే కృత్రిమ నాలుకను పరిశోధకులు అభివృద్ధి చేశారు. విస్కీ నాణ్యతతో పాటు బ్రాండ్‌ పేరు, దానిని తయారుచేసి ఎంతకాలం అయిందనే విషయంకూడా ఇది చెప్పేస్తుందట! దీంతో విస్కీలో కల్తీని నిరోధించడంతోపాటు వివిధ బ్రాండ్‌లలో రుచుల తేడాను సరిగ్గా గుర్తించవచ్చని హెడిల్‌బర్గ్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఖరీదైన విస్కీని కొనుగోలు చేసినపుడు ఈ కృత్రిమ నాలుకతో నాణ్యతను గుర్తించవచ్చని వివరించారు. ఫ్లోరోసెంట్‌ డైతో పనిచేసే ఈ కృత్రిమ నాలుక 33 విస్కీలను గుర్తించగలదని దీని రూపకర్తలు పేర్కొన్నారు.