ముక్కు అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ

అనుభవం మరియు అత్యాధునిక సౌకర్యం (ముక్కు ప్లాస్టిక్ సర్జరీ)

ముక్కు అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ:

ప్లాస్టిక్ సర్జరీ గురించి:

ఇది అసంభవం, కంప్లీకేషన్స్ వస్తాయి అనేది అపోహ, ఇది సైన్‌టిఫిక్ సర్జికల్ ప్రక్రియ రైనోప్లాస్టీ అంటాము. ఇది 6 సంవత్సరాలు వయసు నిండిన తర్వాత చేయవచ్చు. ఆ వయసుకి ముక్కు సామాన్య పెరుగుదల ఆగిపోతుంది. ఆకారంలో రకరకాలు, ఎత్తు తక్కువగా ఉండటం, పొడవు ఎక్కువ, తక్కువ, ముక్కు వంకరగా ఉండటం, ఎముకలు విడ్త్ ఎక్కువగా ఉండటం మొదలైనది. అవి రకాల సమస్యలను సర్జికల్ అనుభవం సరిచేయవచ్చు. ఆధునిక పద్ధతులలో, బయటనుంచి ప్లాస్టిక్ పదార్థాలు కాకుండా, వారి మృదులాస్థితో ముక్కు ఎత్తు పెంచడం జరుగుతుంది. అంతేకాకుండా సర్జరీకి ముందే ముక్కుపై 3-డి ఇమేజింగ్ సహయంతో మార్పులు చేయవచ్చు. 

సమయం ఎంత పడుతుంది: 

సర్జరీ పద్ధతి సమస్యను బట్టి 2 గంటల నుంచి 3 గంటలవరకు పడుతుంది. ఒకరోజు ఆసుపత్రిలో ఉండాలి. కొన్ని రకాల్లో అదే రోజు వెళ్లిపోవచ్చు. 5-7 రోజు ఇంట్లో ఉండాలి, సెలవు అవసరం అవుతుంది.6 లేక 7 రోజుల్లో ప్రయాణం చేయవచ్చు.

మచ్చలు ఏర్పడతాయా: 

కుట్లు కనపడని ప్రదేశంలో వేయడం జరుగుతుంది. లోపలనుంచి వేయడం జరుగుతుంది. మచ్చలు ఏమీ బహిర్గతంగా ఉండవు.

ముక్కు యొక్క పనులు:
గాలి పీల్చడం, వాసనకు సంబంధించి ఏమైనా సమస్యలు వస్తాయా? 

అలాంటి సమస్యలు ఏర్పడవు. ముక్కు మధ్య గోడ (స్టీఫెన్) వంకరగా ఉన్నవారికి అదే సమయంలో సరిచేయవచ్చు. రెండు కలిపి చేయడం వలన దీర్ఘకాలిక ఫలితాలు బాగా ఉంటాయి.

గరిష్టంగా ఎంత వయసు వరకు చేయవచ్చు:

గరిష్టవయసు పరిమితి అని ఏమీ లేదు. సామాన్యంగా 16-35 సంవత్సరాల వరకు చేయవచ్చు. వారి మనస్సులో ఎప్పటినుంచో ఉంటే ఇంకా పెద్ద వయస్సు వారికి కూడా సామాన్యంగా చేస్తూ ఉంటాము.

ఏమి పరిక్షలు అవసరం అవుతాయి:

సాధారణ రక్త పరీక్షలు, అవసరం అయితే ముక్కుకు సంబంధించిన ఎక్స్-రే, సీటీ స్కాన్ ప్రస్తుతం చేయడం జరుగుతుంది.

మరలా మరలా చేయవచ్చా:

మొదటి సందర్భంలోనే ఉత్తమ ఫలితాలకు ప్రయత్నించడం మంచిది. ఇలాంటి సర్జరీలకు అనుభవం గల డాక్టర్లనే సంప్రదించాలి.

డాక్టర్ వెంకట రమణ, ప్లాస్టిక్ సర్జన్,

 9849823081