టాన్సిల్స్‌, ఎడినాయిడ్స్‌ సమస్యలకు ఏకైక పరిష్కారం

ఆంధ్రజ్యోతి, 19-07-2013:రక్షక భటుల మాదిరిగా పనిచేస్తూ, వ్యాధికారక క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా కాపాడటంలో టాన్సిల్స్‌, ఎడినాయిడ్స్‌ల పాత్ర కీలకం. ఇంతటి ముఖ్యభూమిక పోషించే టాన్సిల్స్‌, ఎడినాయిడ్స్‌కు ఇన్‌ఫెక్షన్‌ సోకితే... ఇంకేముంది? శరీరంలోకి అనేక వ్యాధికారక క్రిములు అడ్డూ ఆపూ లేకుండా ప్రవేశించి, అనేక వ్యాధులను తెచ్చిపెడతాయి. ఫలితంగా శరీరం మొత్తం రోగాలమయం అవుతుంది. అయితే టాన్సిల్స్‌, ఎడినాయిడ్స్‌కు ఇన్‌ఫెక్షన్లు సోకకుండా కాపాడుతూ, అనారోగ్యం దరిచేరకుండా చూడటంలో హోమియో చికిత్స కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు హోమియో వైద్యనిపుణులు డాక్టర్‌ శ్రీకర్‌ మను. 

టాన్సిల్స్‌, ఎడినాయిడ్స్‌ అనేవి శరీర రోగ నిరోధక వ్యవస్థలో ముఖ్యమైన కణజాల సమూహం. టాన్సిల్స్‌ గొంతు వెనక భాగంలో, ఎడినాయిడ్స్‌ ముక్కు, నోటి పైభాగంలో ఉంటాయి. ఈ రెండూ కూడా రకరకాల బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకునే ముఖ్యమైన శరీర వ్యవస్థలు. అయితే వీటి పనితనం చిన్న వయసులోనే కనిపిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ వీటి పరిమాణం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
 
ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు 
ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు కనిపించే ప్రథమ లక్షణం గొంతు నొప్పి. అయితే ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించే ప్రక్రియలో వీటి పరిమాణం పెరగడం జరుగుతుంది. జ్వరం, నోటి దుర్వాసన, జలుబుతో ముక్కు మూసుకుపోవడం, గొంతు, మెడలో ఉండే గ్రంథులలో వాపు రావడం, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, కడుపునొప్పి, దగ్గుతో పాటు కఫంలో రక్తం కనిపించడం, స్వరంలో మార్పు రావడం, నోటి ద్వారా గాలి పీల్చాల్సి రావడం, గురక, నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లేకపోవడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.
 
ప్రధాన రకాలు 
ఎక్యూట్‌ టాన్సిలైటిస్‌ : బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల ప్రారంభమై జ్వరంతో పాటు గొంతువాపు, చెవినొప్పి, ఒంటినొప్పులు ఉంటాయి. నోటి దుర్వాసన వస్తుంది. 
క్రానిక్‌ టాన్సిలైటిస్‌ : దీర్ఘకాలంగా ఇన్‌ఫెక్షన్లు ఉండటం వల్ల తరచూ జ్వరం రావడం, చిన్న చిన్న రాళ్లు టాన్సిల్స్‌లో ఏర్పడటంలాంటివి కనిపిస్తూ శరీర ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. 
పెరి టాన్సిలార్‌ అబ్సెస్‌ : టాన్సిల్స్‌లో చీము ఏర్పడి, కొండనాలుకపై ఒత్తిడి ఏర్పడి విపరీతమైన నొప్పి మొదలవుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెంది ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది.
 
దుష్ప్రభావాలు 
చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే కీళ్లవాతం, సైనసైటిస్‌, చెవి సంబంధ ఇన్‌ఫెక్షన్‌, న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులు రావడం, కిడ్నీలు పనిచేయకపోవడం, శారీరక ఎదుగుదలపై ప్రభావం పడటం వంటి సమస్యలు వచ్చిపడతాయి.
 
ఇవి అంటువ్యాధులా? 
బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది. అయితే వ్యక్తి రోగ నిరోధకశక్తి , గ్రహణ శీలత ప్రాముఖ్యాన్ని బట్టి అనారోగ్యం వాటిల్లుతుంది.
 
నిర్ధారణ
బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్‌ కొద్దిపాటి జ్వరంగా మొదలై గొంతునొప్పితో కూడి ఉంటుంది. వైరస్‌ల ప్రభావంతో వచ్చే ఇన్‌ఫెక్షన్‌లో గొంతునొప్పి, జలుబు, తుమ్ములు, దగ్గు వంటివి కనిపిస్తాయి. అంతేకాకుండా గొంతు పరిశీలించడం, రక్తపరీక్షలు, ఎక్స్‌రే ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు.
 
జాగ్రత్తలు 
కారణం ఏదైనా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా చూసుకోవాలి. పరిశుభ్రత పాటించాలి. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు చేతి రుమాలు అడ్డంపెట్టుకోవాలి. కాచి వడబోసిన నీటిని మాత్రమే తాగాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు వేడినీళ్లలో ఉప్పు వేసి రోజూ నాలుగైదు సార్లు పుక్కిలించాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
 
హోమియో చికిత్స 
శరీరంలోకి ముక్కు, నోటి ద్వారా ప్రవేశించే క్రిములకు అడ్డుకట్ట వేయడంలో టాన్సిల్స్‌, ఎడినాయిడ్స్‌ల పాత్ర కీలకం. వీటికి ఇన్‌ఫెక్షన్‌ సోకితే పనితీరు మందగించి క్రిములు సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అయితే హోమియో మందులు ఇన్‌ఫెక్షన్‌ని పూర్తిగా నిర్మూలించడంతో పాటు తిరిగి అనారోగ్యం బారినపడకుండా కాపాడ తాయి. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ అంటే దుష్ప్రభావాలూ లేకుండా పూర్తిగా సురక్షితమైన విధానంలో రోగి శరీరతత్వాన్ని తిరిగి యఽథాస్థానంలోకి తీసుకురావడం హోమియో చికిత్స విశిష్టత. అయితే ప్రతి రోగిలో సామాన్య రోగ లక్షణాలతో పాటు భిన్నమైన లక్షణాలు కూడా కలిసి ఉంటాయి. ఆ లక్షణాలను గుర్తించి తగిన మందులు ఇచ్చినప్పుడు మాత్రమే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. హోమియో చికిత్సలో ఇదే విధానాన్ని అనుసరించడం జరుగుతుంది.అందుకే అద్భుతమైన ఫలితాలు పొందుతుంటారు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే టాన్సిల్స్‌, ఎడినాయిడ్స్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. 

డాక్టర్‌ శ్రీకర్‌ మను 
ఫౌండర్‌ ఆఫ్‌ డా. మనూస్‌ హోమియోపతి, 
ఫోన్‌ : 9032 108 108 
9030 339 999