చెవిలో శబ్దాలు

ఆంధ్రజ్యోతి,20-04-2017: చెవిలోని అంతర్గత విభాగాలు వ్యాధికి గురైతే పలురకాల సమస్యలు తలెత్తుతాయి. చెవిలో శబ్దాలు రావడం వీటిలో ఒకటి. వేసవి కాలంలో ఉష్ణోగ్రత చాలా తీవ్రంగా ఉన్న వేళల్లో, ఎక్కువ గంటలు ఎండలో ఉన్నప్పుడు కూడా చెవిలో శబ్దాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఎండ వేడిమి నేరుగా చెవిలోకి దూసుకుపోకుండా, చెవిలో దూదిగానీ, తల చుట్టూ మఫ్లర్‌ను గానీ వాడటం మంచిది. వీటితో పాటు వాతావరణంతో సంబంధం లేకుండా, తల తిరగడం, శరీరం తూలడం, కడుపులో వికారంగా కూడా అనిపిస్తుంది. ఈ సమస్యలకు విరుగుడుగా...! 

వెల్లుల్లిపాయల రసాన్ని ప్రతి పూటా మూడు చుక్కల చొప్పున చెవిలో వేసుకుంటే ఈ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. పండు జిల్లేడు ఆకులను బాగా వేడిచేసి, నలిపి పిండగా వచ్చిన రసాన్ని మూడు చుక్కల చొప్పున.. చెవిలో వేసినా శబ్దాలు ఆగిపోవడంతో పాటు చెవి సంబంధితమైన ఇతర సమస్యలు కూడా నయమవుతాయి.
బాదం నూనెను కొంచెంగా వేడిచేసి వెంటనే బయటకు రాకుండా దూది పెట్టాలి. ఇలా ప్రతిపూటా చేస్తే చెవి సమస్యలు త్వరగా తగ్గిపోతాయి.
నిర్గుండి తైలపు చుక్కలను ప్రతిపూటా చెవిలో వేయాలి. సూర్యవర్తి, మాతులుంగ రసాలను చెవిలో వేసినా ఈ సమస్యలు తగ్గుతాయి.