చెవిటి వారికోసం కొత్త సాఫ్ట్‌వేర్‌

లండన్‌, 19-03-2017: వినికిడి లోపంతో బాధపడుతున్న వారికోసం సరికొత్త సాఫ్ట్‌వేర్‌ పోగ్రాంను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. లిప్‌ రీడింగ్‌ ద్వారా ఎదుటి వ్యక్తి మాట్లాడే విషయాన్ని చదివేయడమే ఈ సాఫ్ట్‌వేర్‌ ప్రత్యేకత అని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ పరిశోధకులు వివరించారు. ది వాచ్‌, అటెండ్‌ అండ్‌ స్పెల్‌(డబ్ల్యూఏఎస్)గా వ్యవహరిస్తున్న సాఫ్ట్‌వేర్‌ పెదాల కదలికలను గమనిస్తూ, మన మాటలను చకచకా చెప్పేస్తుందన్నారు. ప్రయోగాత్మకంగా.. ఈ సాఫ్ట్‌వేర్‌కు, లిప్‌ రీడింగ్‌ నిపుణుడికి పరీక్ష పెట్టగా, సాఫ్ట్‌వేర్‌ పోగ్రాం ఫలితాలే ఎక్కువ కచ్చితత్వంతో ఉన్నాయని వర్సిటీ విద్యార్థి జూన్‌ సన్‌ చంగ్‌ తెలిపారు.