హలో.. వినపడుతోందా?

20-11-2017: జలుబు, దగ్గులాంటి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ను అశ్రద్ధ చేస్తే అది ముక్కు వెనక భాగం నుంచి మధ్య చెవికి కనెక్ట్‌ అయి ఉండే మార్గంలోకి పాకుతుంది. ఆ చిక్కటి చీము మరింత ఎక్కువైనప్పుడు కర్ణభేరి మీద ఒత్తిడి పెరిగి అది పగులుతుంది. ఇలా ఏ అర్థరాత్రో జరుగుతుంది. దాంతో భరించలేని చెవి నొప్పితో నిద్ర మెలకువవుతుంది. ఇది పిల్లలు, పెద్దలు ఎవరికైనా రావొచ్చు. శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా బాధించే చలికాలంలో ఈ సమస్య ఎక్కువ. కర్ణభేరి పగిలేంతగా ఈ సమస్య ముదరకముందునుంచే చెవిలో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఈ సమస్యనే అక్యూట్‌ సపురేటివ్‌ ఆటైటిస్‌ మీడియా, అంటారు. ఆ లక్షణాలు కనిపించగానే వైద్యుల్ని కలిసి చికిత్స తీసుకోవాలి.