ఈఎన్‌టీ సమస్యలు ఇక దూరం

ఆంధ్రజ్యోతి, 02-01-2012: చలికాలం వచ్చిందంటే చాలు చల్లగాలికి మా అబ్బాయికి ఇట్టే జలుబు చేస్తోంది. దీనివల్ల స్కూలుకు వెళ్లలేకపోతున్నాడు తల్లులు ఆందోళన చెందడం చూస్తుంటాం. క్రిస్‌మస్‌ రోజున స్నేహితులు కూల్‌డ్రింక్స్‌ ఆఫర్‌ చేస్తే తాగా, అంతే మరుసటి రోజు నొప్పి గొంతులో ఇన్‌ఫెక్షన్‌ అని ఆవేదన చెందే యువతులు కనిపిస్తుంటారు. రాత్రి మా వాడికి చెవిపోటు లేచింది. వాడు పడుకోలేదు, మమ్మల్ని పడుకోనివ్వలేదు అని ఫిర్యాదు చేసే తల్లిదండ్రులు ఉంటారు. ఈ సమస్యలు మనలో చాలా మందికి ఏదో ఒక సందర్భంలో ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఈ సమస్యలకు హోమియోలో చక్కని మందులు అందుబాటులో ఉన్నాయంటున్నారు డాక్టర్‌ మురళి అంకిరెడ్డి. 

మారుతున్న ఆధునిక కాలంలో వాయు, శబ్దకాలుష్యాలు పెరగడం, వాతావరణంలో మార్పులు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు కారణమవుతున్నాయి. చిన్న పిల్లల్లో ఈ సమస్యలు మరీ అధికంగా కనిపిస్తుంటాయి. శరీర నిర్మాణరీత్యా ముక్కు, చెవి, గొంతు సన్నిహిత సంబంధం కలిగి ఉంటాయి. పైకి కనిపించకపోయినా లోపలి భాగాలు ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. 

చెవి : చిన్న పిల్లల్లో చెవి సంబంధ వ్యాధులు ప్రధానంగా మధ్య చెవిలో ఇన్‌ఫెక్షన్ల వల్ల వస్తాయి. దీనిని ఒటైటిస్‌ మీడియా అంటారు. ఇది రెండు రకాలు. అక్యూట్‌ సప్పురేటివ్‌ ఒటైటిస్‌ మిడియా, క్రానిక్‌ సప్పురేటివ్‌ ఒటైటిస్‌ మిడియా. జలుబు చేయడం వల్ల, మధ్యచెవిలో నీరు ఉండిపోవడం వల్ల, పిల్లలను చల్లగాలిలో పడుకోబెట్టడం వల్ల చెవి ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కొన్నిసార్లు టాన్సిల్స్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల, పంటినొప్పి వల్ల కూడా చెవిపోటు వచ్చే అవకాశం ఉంది. 

లక్షణాలు : చెవిపోటు రాత్రివేళ ఎక్కువగా వస్తుంది. నొప్పి మూలంగా నిద్రపోలేరు. పాలు తాగలేరు. చెవిలోపల ఎర్రబడి ముట్టుకుంటే నొప్పిగా ఉంటుంది. జ్వరం కూడా రావచ్చు. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా ఉంటే మెడ దగ్గర సర్వైకల్‌ గ్రంథులు పెద్దవవుతాయి. సాధారణంగా ఎక్యూట్‌ ఇన్‌ఫెక్షన్‌ రెండు వారాల్లోగా తగ్గిపోతుంది. అలా తగ్గకపోయినా, సరియైన చికిత్స తీసుకోకపోయినా ఇన్‌ఫెక్షన్‌ చెవి లోపలి భాగాలకు సోకి కర్ణభేరికి రంధ్రంపడి చీముకారడం మొదలవుతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో చెవుడు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇన్‌ఫెక్షన్‌ మెదడు వరకు పాకి మెదడు వాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. 

ముక్కు : ముక్కు కారడం, తుమ్ములు, ముక్కుదిబ్బడ, గొంతునొప్పి, నొటి ద్వారా గాలి పీల్చాల్సిరావడం వంటి లక్షణాలు ఉంటాయి. 

కారణాలు : జలుబు(రైనైటిస్‌), అలర్జీ(అలర్జిక్‌ రైనైటిస్‌), నాసల్‌ పాలిప్స్‌, నాసల్‌ ఎడినాయిడ్స్‌. సాధారణ జలుబు రైనోవైరస్‌ లేదా కొరోనా వైరస్‌ వల్ల కలుగుతుంది. కొంతమందికి కొన్ని వాసనలు, కొన్ని పదార్థాలు అలర్జీని కలిగిస్తాయి. పూలపుప్పొడి కూడా అలర్జీకి కారణమవుతుంది. అలర్జీ కలిగినపుడు ఆగకుండా తుమ్ములు వస్తుంటాయి. ముక్కు సమస్యలో మరొకటి నాసల్‌పాలిప్స్‌. పారానాసల్‌ సైనసెస్‌ మ్యూకస్‌ మెంబ్రేన్‌ నుంచి పెరిగే కణుతులను నాసల్‌పాలిప్స్‌ అంటారు. ముక్కు కారడం, నోటితో గాలి పీల్చాల్సి రావడం, ముక్కు దిబ్బడ, దీర్ఘకాలికంగా సైనస్‌తో బాధపడుతుండటం, తలనొప్పి, వాసనను గ్రహించే శక్తి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ముక్కు వెనకభాగంలో ఉండే లింఫాయిడ్‌ టిష్యూ నుంచి పెరిగే కణుతుల్ని నాసల్‌ ఎడినాయిడ్స్‌ అంటారు. వీటివల్ల ముక్కురంధ్రాలు మూసుకుపోయి గురక, నోటిద్వారా శ్వాసతీసుకోవాల్సి రావడం జరుగుతుంది. 

ముక్కు నుంచి రక్తం: ఏదైనా వస్తువు ముక్కుపైన బలంగా తగిలినపుడు ముక్కు నుంచి రక్తం కారే అవకాశం ఉంటుంది. రక్తపోటు పెరిగినా, ఎత్తైన ప్రదేశంలో ఉన్నా, ఎక్కువ ఒత్తిడితో ముక్కును చీదినా రక్తం కారవచ్చు. 
గొంతు: కొందరికి ఉదయం నిద్రలేవగానే తీవ్రమైన గొంతునొప్పి వస్తుంది. జ్వరం ఉండదు. దీనికి కారణం రాత్రి పడుకున్న గది పొడిగా ఉండి, ఓవర్‌హీట్‌ అయి ఉంటుంది. అలాకాకుండా రోజులు గడుస్తున్నా గొంతునొప్పి తగ్గకపోయినట్లయితే ఇతర కారణం ఉండి ఉంటుందని భావించాలి. ఒక్కోసారి శ్వాసమార్గం మూసుకోవడం వల్ల కూడా గొంతునొప్పి వస్తుంది. 

శ్వాసమార్గాన్ని ఇబ్బందిపరిచే ఇన్‌ఫెక్షన్లు మూడు రకాలుగా ఉంటాయి. అవి,
 
1) టాన్సిల్స్‌ చుట్టూ చీము పేరుకుపోవడం. దీనిని పెరి టాన్సిలార్‌ ఆబ్సెస్‌ అంటారు. తీవ్రమైన గొంతునొప్పి, టాన్సిల్స్‌ వాపు, లింఫ్‌గ్రంథులు వాయడం, జ్వరం , తలనొప్పి వంటి లక్షణాలుంటాయి. 
2) నాలుక కింది భాగాన చీము పట్టి అది దవడ పొడుగునా దంతాలు చుట్టూ వ్యాపిస్తుంది. దీనిని లుడ్విగ్స్‌ యాంజైనా అంటారు. 

3) ఎపిగ్లోటిస్‌కు చీము పట్టడం. దీనిని ఎపిగ్లోటైటిస్‌ అంటారు. ఇన్‌ఫెక్షన్‌కు గురైన ఎపిగ్లోటిస్‌ వాచి నొప్పితో సాధారణ కదలికలను చేయలేకపోతుంది. గొంతునొప్పి ప్రారంభదశలోనే చికిత్స తీసుకుంటే ఈ మూడు రకాల ఇన్‌ఫెక్షన్లను సులభంగా తగ్గించుకోవచ్చు. 

హార్ట్‌బర్న్‌ : ఒక్కోసారి జీర్ణాశయంలోని శక్తివంతమైన ఆమ్లాలు అన్నవాహికలోకి, అక్కడి నుంచి గొంతు వరకు ఎగిసిరావడం వల్ల గొంతుమంట, నొప్పి ఏర్పడుతుంది. దీనిని యాసిడ్‌రిఫ్లక్స్‌ అంటారు. 
రుమాటిక్‌ ఫీవర్‌ : సె్ట్రప్టోకాకస్‌ అనే సూక్ష్మక్రిమి గొంతును సోకినపుడు ఈ వ్యాధివస్తుంది. ఇది ఎక్కువగా పిల్లల్లో వస్తుంది. రుమాటిక్‌ ఫీవర్‌ ప్రారంభదశలో గొంతునొప్పి, గొంతులో తెల్లటిమచ్చలు ఉంటాయి. రెండు వారాల తరువాత జ్వరం, కీళ్ళవాపు, నొప్పి ఉంటుంది. ఆ తరువాత గుండె కండరానికి సోకి గుండె కవాటాలను శాశ్వతంగా నాశనం చేస్తుంది.
 
హోమియో చికిత్స 
చెవి, ముక్కు, గొంతు సమస్యలకు హోమియోలో సంపూర్ణచికిత్సతోపాటు మూలకారణాన్ని నిర్మూలించి మళ్లీ మళ్లీ రాకుండా చేయడం జరుగుతుంది. చెవి సంబంధ వ్యాధులకు కాల్కేరియా కార్బ్‌, హెపార్‌ సల్ఫ్‌, కాలిబైక్రోమియం, మెర్క్‌సాల్‌, పల్సటిల్లా మొదలైన హోమియో మందులు బాగా ఉపకరిస్తాయి. ముక్కుకి సంబంధించిన వ్యాధులకు కాల్కేరియా కార్బ్‌, ఆర్సెనిక్‌, మెర్క్‌సాల్‌, రూమెక్స్‌, సాంగ్వినేరియా వంటి మందులు ఉపకరిస్తాయి. గొంతు సమస్యలకు ఆర్జెంటమ్‌ నైట్రికమ్‌, బెల్లడోనా, హయోసయామస్‌, హెపార్‌సల్ఫ్‌, మెర్క్‌సాల్‌, నైట్రిక్‌యాసిడ్‌ వంటి మందులు బాగా పనిచేస్తాయి. సమస్య మొదలైన వెంటనే అనుభవజ్ఞులైన హోమియో వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే ఫలితం బాగుంటుంది. 

డా. మురళి అంకిరెడ్డి 
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ 
ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు 
ఫోన్‌ : 9550003399, 9550001144