వాసన సామర్థ్యం తగ్గితే డెమెన్షియా!

30-11-2017: వాసన సామర్థ్యం తగ్గడానికీ, డెమెన్షియా(చిత్త వైకల్యం)కు సంబంధం ఉంది అంటున్నారు అధ్యయనకారులు. మామూలుగా ఎలాంటి వాసననైనా మన ముక్కు తేలికగానే గుర్తించగలుగుతుంది. అయితే వయస్సు వస్తున్న కొద్దీ కొంతమందిలో ఈ వాసన సామర్థ్యం తగ్గిపోతుంది. ఇలాంటి వారిలోనే డెమెన్షియా తలెత్తే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని  వారు చెబుతున్నారు. ఈ విషయంలో స్త్రీ పురుష బేధం ఏమీ ఉండదని అంటున్నారు. ఏవరైనా, ఏ వయస్సులో ఉన్న వారైనా వాసన సామర్థ్యాన్ని కోల్పొతుంటే వారు డెమెన్షియాకు దగ్గరవుతున్నట్టు గమనించాలని వారు చెబుతున్నారు. వీరిలో విషయగ్రహణ శక్తి సాధారణంగా ఉన్నా డెమెన్షియా ముప్పు తప్పకపోవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు. వాసన సామర్థ్యం తగ్గిపోతున్నట్టు గుర్తించినట్టయితే వెంటనే వైద్యులను సంప్రదించాలని వారు సూచిస్తున్నారు.