రక్తనాళాల్లో గడ్డలను కరిగించే అల్ట్రాసౌండ్ డ్రిల్‌

వాషింగ్టన్‌:అల్ట్రాసౌండ్ సాయంతో రక్తనాళాల్లోని గడ్డలను కరిగించే కొత్త పరికరాన్ని నార్త్‌ కరొలినా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు తయారుచేశారు. తక్కువ తీవ్రతలో వెలువడే ఈ తరంగాలతో రక్తనాళాల్లో అవరోధాలు తొలిగించవచ్చన్నారు. ఈ పరికరం శస్త్రచికిత్సల సమయాన్ని తగ్గించేందుకు తోడ్పడుతుందని వర్సిటీ ప్రొఫెసర్‌ క్సియోనింగ్‌ క్సియాంగ్‌ తెలిపారు.