నులిమేసే కండరాల నొప్పి

28-06-2017:ఫైబ్రోమయాల్జియా అంటే కండరాల నొప్పి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ప్రైమరీ ఇందులో కండరాలనొప్పి వేరే ఇతర కారణాల వలన రాదు. రెండవది సెకండరీ ఇందులో ఇతర వ్యాధులు లేదా ఇతర కారణాల వలన కండరాల నొప్పి వస్తుంది.

లక్షణాలు
కండరాలు కుదించుకుపోయినట్లు అనిపించడం, కొంకర్లు పోవడం, కండరాల నొప్పి
నిద్ర లేచిన తర్వాత అలసటగా ఉండటం, నీరసం
శరీరం శక్తి కోల్పోయినట్లు అనిపించడం
మెడ, వెన్ను, భుజాలు మొదలైనవి సున్నితంగా ఉండటం
నిద్రలేమి, ఉదయం లేచినవెంటనే కండరాలు బిగుతుగా ఉండటం వంటి లక్షణాలు
 
కారణాలు
రక్తహీనత, థైరాయిడ్‌ సమస్యలు, అడ్రినల్‌ సమస్యలు, శరీరంలో క్యాల్షియం నిలువలు తక్కువగా ఉండటం, న్యూరోపతి అంటే నరాలకు సంబంధించిన సమస్య, అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్‌
 
నిర్ధారణ పరీక్షలు
సిబిపి, ఈ్‌సఆర్‌ టి3, టి4, టిఎ్‌సహెచ్‌, సీరమ్‌ క్యాల్సిం, ఆర్‌బిఎస్‌, ఎఫ్‌బిఎస్‌, పిఎల్‌బిఎస్‌, అడ్రీనల్‌ గ్లాండ్‌ పరీక్షలు, స్లీప్‌ ఆప్నియా పరీక్షలు
 
హోమియో చికిత్సలో...
బ్రయోనియా: శరీరంలో ఉన్న అన్ని కండరాలు నొప్పిగా ఉంటాయి, నొప్పి గుచ్చినట్లు, కోస్తున్నట్లు ఉంటుంది. ఈ నొప్పి కదలికలకు ఎక్కువగా ఉంటుంది. దాహం ఎక్కువగా ఉంటుంది. ఇది ధృడంగా ఉండి, నల్లగా ఉండేవారికి మంచి మందు.
రస్టాక్స్‌: ఇది అధిక శ్రమ, అధికబరువు ఎత్తడం వంటి పనులు చేసిన తర్వాత వచ్చే సమస్యలకు మంచి మందు. ఇది ముఖ్యంగా కీళ్ళు, కండరాల మీద బాగా పనిచేస్తుంది. కీళ్ళవాపు, నొప్పి, చల్లగాలిని భరించలేరు, కాళ్ళుపట్టినట్లు ఉంటాయి. సయాటికా, కుదురుగా ఒకచోట కూర్కోలేరు. తిమ్మిర్లు మొదలైన సమస్యలు ఉంటాయి.
కాల్చికమ్‌: ఇది ముఖ్యంగా కండరాలు, కీళ్ళు, కీళ్ళ చుట్టూ ఉండే పొరలమీద మంచి ప్రభావం చూపుతుంది. వాత రోగం(గౌట్‌)తత్త్వం కలవారికి కీళ్ళ నొప్పి, వాపు, అధిక నీరసం, శరీరంలోపల చల్లగా ఉండటం, రాత్రి ఎక్కువసేపు నిద్ర మెలకువుగా ఉండటం, చేతులు, కాళ్ళకు పిన్నులతో గుచ్చినట్లుగా అనిపించడం, తిమ్మిర్లు, కీళ్ళు పట్టినట్లు ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి.
 
ఫార్మికా రూఫా: ఇది వాతరోగం ఉన్నవారికి మంచి మందు. కీళ్లు పట్టినట్లు ఉండటం, కదలికలు కష్టంగా ఉండటం, కుడిపక్క సమస్యలు అధికంగా ఉండటం, మలబద్దకం, మల విసర్జనకు ముందు బొడ్డు చుట్టూ నొప్పి, కండరాలు అలసినట్లు వాటి స్థానం నుంచి విడిపోయినట్లు అనిపించడం నీరసం నొప్పులు గుచ్చినట్లు ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి.
కాల్మియా: ఇది రుమాటిక్‌ సమస్యలకు మంచి మందు, నరాల నొప్పి, నొప్పి శరీరం పై భాగం నుంచి కింది భాగానికి వెళ్తుంది. తిమ్మిర్లు, నొప్పులు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మారుతుండటం, మెడ నొప్పి చేతుల నొప్పులు, నడుం నొప్పి, కుడి భుజం మోకాళ్లు, పాదాలనొప్పి, నీరసం, నొప్పులు గుచ్చినట్లు ఉండటం వంటి లక్షణాలుంటాయి.
ఆర్నికా: ఇది గాయాలు తగిలిన తర్వాత వచ్చే సమస్యలకు మంచి మందు. శరీరం సున్నితంగా ఉండి స్పర్శని తట్టుకోలేరు, వారు పడుకున్న ప్రదేశం గట్టిగా అనిపించి కదులుతుంటారు. చిన్న పనులకే తొందరగా అలసట రావడం, ఒంటరిగా ఉండాలనుకోవడం వాతరోగం, నడుం నొప్పి తొందరగా బెణకడం లేదా వాటి స్థానం నుంచి కదిలినట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి.
ఆర్సినికమ్‌ ఆల్బమ్‌: ఆందోళన, మరణమన్నా, ఒంటరితనం అన్నా భయం, మందులు వాడి ఉపయోగంలేదు అని భావించడం, స్వార్ధం, పిరికిగా ఉండటం చాలా పొదుపుగా ఉండటం శరీరం వణకటం మెలితిరిగినట్లు అనిపించడం, నీరసం, బరువు, పాదాల వాపు, నొప్పులు మండినట్లు ఉండటం, అధిక దాహం వంటి లక్షణాలు ఉంటాయి.
లైకోపోడియం: ఉత్సాహంగా లేకపోవడం, ఒంటరిగా ఉండ టానికి భయం, కొత్త పనులు చేయడానికి ఇష్టపడకపోవడం సున్నిత స్వభావం కలిగి ఉండటం, మతిమరపు, మాట్లాడుతున్నపుడు, రాస్తున్నపుడు తప్పు పదాలు పలకడం, తిమ్మిర్లు, కాళ్లు నొప్పి, చేతులు బరువుగా ఉండటం, కుడిపక్క సమస్యలు ఎక్కువగా ఉండటం, కండరాలు మెలితిరిగినట్లు అనిపించడం ఉదయం ఎక్కువగా నిద్రపోవడం, తీపి పదార్థాలను ఇష్టపడటం వంటి లక్షణాలు ఉంటా యి. ఈ లక్షణాలు కుడిపక్క వేడికి ఎక్కువగా ఉంటాయి. చల్ల వాతావరణానికి కొంత ఉపశమనం లభిస్తుంది.
డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి, ఎం.డి.
హోమియో, స్టార్‌ హోమియోతి,
ఫోన్‌- 8977 336677,
టోల్‌ ఫ్రీ :1800-108-5566
www.starhomeo.com
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక