మధుమేహ సమస్యలు ఇక దూరం

05-01-12


డయాబెటిస్‌...ప్రపంచంలో అతి వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి. దీనివల్ల ఎన్నో దుష్ఫలితాలు కలుగుతున్నాయి. ఎంతో మంది కాళ్లు పోగొట్టుకుంటున్నారు. గుండె జబ్బుల బారినపడుతున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారమే లేదా? అంటే ఆధునిక హోమియో చికిత్సతో డయాబెటిస్‌ వల్ల కలిగే దుష్ఫలితాలను సంపూర్ణంగా నివారించవచ్చని అంటున్నారు ప్రముఖ హోమియో వైద్యులు డా. మధు వారణాశి.
 
ఆధునిక జీవన విధానం ఎన్నో సమస్యలకు కారణమవుతోంది. ఇందులో ముఖ్యమైంది మధుమేహం. ఇది ఒక మెటబాలిక్‌ డిజార్డర్‌.  ఈ వ్యాధి వల్ల శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతింటాయి. సుమారు 10 రకాల వ్యాధులు రావడానికి మధుమేహమే కారణమని పరిశోధనల్లో తేలింది. వైద్యరంగంలో ఆధునిక చికిత్సలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా ఈ వ్యాధికి శాశ్వత పరిష్కారం చూపించలేకపోయాయి. జీవితాంతం మందులు వాడుతూ నియంత్రణలో ఉంచుకోవడం ఒక్కటే మార్గం. అయితే చాలా మందిలో మధుమేహం ఉన్నట్లు గుర్తించేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అందువల్లే దీనిని సైలెంట్‌ కిల్లర్‌ అంటారు. ప్రతీఒక్కరూ ఆరునెలలకొకసారి మధుమేహ పరీక్షలు చేయించుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారం. అధిక రక్తపోటు ఉన్నవారు,  35 ఏళ్లు పైబడిన వారు, స్థూలకాయంతో బాధపడే వారు, మానసిక ఒత్తిడికి గురవుతున్నవారు, శారీరకశ్రమ లేనివారు, స్టెరాయిడ్స్‌ వాడుతున్న వారు మధుమేహ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్‌ ఉన్నా పరీక్ష చేయించుకోవాలి. 
కారణాలు
శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గడం, కాలేయ వ్యాధులు, స్థూలకాయం, బీటా కణాలు నశించిపోవడం, జన్యుసంబంధమైన వ్యాధులు, మానసిక ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం డయాబెటిస్‌కు కారణమవుతున్నాయి. 
డయాబెటిక్‌ నెఫ్రోపతి
దీర్ఘకాలంగా డయాబెటిస్‌తో బాధపడుతున్నవారిలో మూత్రపిండాలు దెబ్బతింటాయి. మూత్రపిండాలలోని నెఫ్రాన్స్‌లో ఉన్న రక్తనాళాలు పాడైపోయి రక్తాన్ని వడగట్టే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల బయటకు వెళ్లాల్సిన విషపదార్థాలు శరీరంలో పేరుకుపోయి అనేక సమస్యలకు దారితీస్తుంది. దీనిని డయాబెటిక్‌ నెఫ్రోపతి అంటారు. ఇది ప్రాణాంతక మైనది. 
డయాబెటిస్‌ కార్డియాలజి
శరీరంలోని కణాలకు సరియైన శక్తి అందకపోతే కొవ్వు పదార్థాల నుంచి శక్తిని విడుదల చేసే ప్రక్రియలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడి హార్ట్‌ఎటాక్‌ రావడం జరుగుతుంది. 
డయాబెటిస్‌ రెటినోపతి
రక్తంలో షుగర్‌ ఎక్కువయినపుడు కంటిలోని కటకం మందంగా తయారయి కంటి చూపు తగ్గడం జరుగుతుంది. కొన్నిసార్లు రెటినాలో రక్తస్రావం జరిగి అకస్మాత్తుగా కంటిచూపు తగ్గిపోతుంది. 
డయాబెటిస్‌ న్యూరోపతి
డయాబెటిస్‌ అదుపులో లేకపోతే కాళ్లలో నరాలు దెబ్బతింటాయి. దీనివల్ల స్పర్శ తగ్గిపోతుంది. కాళ్లకు దెబ్బతగిలినా నొప్పి తెలియదు. వేడి వస్తువులు తగిలినా నొప్పి తెలియక పాదాలలో బొబ్బలు ఏర్పడతాయి. రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల ఆనెలు, పుండ్లు ఏర్పడతాయి. కీళ్లలో కదలికలు తగ్గి అధిక ఒత్తిడికి గురయి నొప్పి కలుగుతుంది. కాళ్లలో మంటలు, సూదులు పొడిచినట్లు ఉండటం, స్పర్శ తగ్గడం, రక్తనాళాలు ఉబ్బడం, కాళ్లకు రక్తప్రసరణ తగ్గడం, పాదాలు పొడిబారినట్లు కావడం, గోర్లు మందంగా మారడం, నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి, కాలి వేళ్ల రంగు మారడం వంటి లక్షణాలు ఉంటాయి. 
డయాబెటిస్‌ - లైంగిక సమస్యలు
డయాబెటిస్‌ వల్ల పురుషులలో అంగస్తంభన సమస్యలు ఏర్పడతాయి. పురుషాంగానికి రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాలు దెబ్బతినడం వల్ల అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది. కొన్నిసార్లు స్తంభించినా కొద్ది క్షణాలలోనే మెత్తబడిపోతుంది. మరికొందరిలో శీఘ్రస్కలన సమస్య ఏర్పడుతుంది. స్ర్తీలలో జననేంద్రియాలకు సంబంధించిన రక్తనాళాలు దెబ్బతినడం వల్ల సంయోగంలో నొప్పి, భావప్రాప్తి లేకపోవడం జరుగుతుంది. పురుషులలో తరచుగా దురద, ఇన్‌ఫెక్షన్స్‌ వస్తుంటాయి. 
డయాబెటిస్‌- దంత సమస్యలు
మధుమేహం ఉన్న వారికి నోట్లో బ్యాక్టీరియా ఎక్కువవుతుంది. దీనివల్ల చిగుళ్లు దెబ్బతింటాయి. చిగుళ్ల వాపు, పంటి నొప్పి. పళ్లు ఊడిపోవడం జరుగుతుంది. చిగుళ్ళనుంచి రక్తం కారుతుంటుంది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోకపోతే రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఫంగల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. చర్మవ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది.
హోమియో చికిత్స
అనుభవజ్ఞులైన హోమియో వైద్యుని పర్యవేక్షణలో వ్యాధి మూలాన్ని గుర్తించి చికిత్స అందిస్తే డయాబెటిస్‌, దాని దుష్ఫలితాలను సమూలంగా నివారించవచ్చు. డయాబెటిస్‌ వ్యాధి ఒక అవయవానికి సంబంధించినది కాదు. శరీరం మొత్తానికి సంబంధించినది. మానసిక, శారీరక లక్షణాలపై ఆధారపడి చికిత్స చేయడం వల్ల సాధారణ ఆరోగ్యస్థితికి చేరుకునేలా చేయడమే హోమియో చికిత్స మూలసూత్రం. డయాబెటిస్‌ వ్యాధి విషయంలోనూ ఇదే విధంగా చికిత్స అందించి దానివల్ల కలిగే దుష్ఫలితాలను సమర్థవంతంగా అరికట్టడం జరుగుతుంది.
 
డా. మధు వారణాశి, ఎం.డి
ప్రముఖ హోమియో వైద్యులు
ప్లాట్‌ నెం 188, 
వివేకానందనగర్‌ కాలనీ, 
కూకట్‌పల్లి, హైదరాబాద్‌,
ఫోన్‌ : 8897331110,  8886 509 509.