మధుమేహం సర్జరీతో మాయం

19-02-13

 
అదేంటి! షుగర్‌ వ్యాధి ఉంటే జీవితాంతం మందులు వాడాల్సిందే అని డాక్టర్లు చెబుతున్నారు. మరి ఇక్కడేమో సర్జరీతో షుగర్‌ వ్యాధి మాయం అంటున్నారు. ఎలా? అని సందేహిస్తున్నారా. కొందరిలో షుగర్‌ వ్యాధి రావడానికి స్థూలకాయం కారణమవుతుంది. అటువంటి వారికి బేరియాట్రిక్‌ సర్జరీతో స్థూలకాయాన్ని తగ్గిస్తే ఆటోమెటిక్‌గా షుగర్‌ వ్యాఽధి తగ్గిపోతుంది. ఆరోగ్యమైన జీవతం గడిపే అవకాశం దక్కుతుంది అని అంటున్నారు డాక్టర్‌ జి. సురేష్‌చంద్ర హరి.
 
ఆహారపు అలవాట్లు పాటించకపోవడం, శారీరక శ్రమ కొరవడటం వల్ల స్థూలకాయంతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు జన్యుపరమైన కారణాల వల్ల కూడా అధిక బరువు పెరుగుతుంటారు. కారణమేదైనా స్థూలకాయం వల్ల అనేక సమస్యలు వచ్చిపడతాయి. ముఖ్యంగా డయాబెటిస్‌ వస్తుంది. డయాబెటిస్‌ వెనకే గుండె సమస్యలు, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. స్థూలకాయం మూలంగా షుగర్‌ వ్యాధి వచ్చినా, షుగర్‌ వ్యాధి ఉండి అధిక బరువుతో బాధపడుతున్నా బేరయాట్రిక్‌ సర్జరీ బాగా ఉపయోగపడుతుంది. డయాబెటిస్‌ కోసం నిత్యం మందులు వాడే రోగులతో పాలిస్తే బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్న వారిలో ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడుతోందని పలు అధ్యయనాల్లోనూ వెల్లడయింది. 
సర్జరీతో ఎన్నో లాభాలు
స్లీవ్‌ గ్యాస్ట్రెక్టమి చేయించుకున్న వారిలో 80 శాతం మందికి సర్జరీ జరిగిన 18 నెలలలో డయాబెటిస్‌ పూర్తిగా నయమయ్యింది. సర్జరీకి ముందు 41.3 ఉన్న వారి బాడీ మాస్‌ ఇండెక్స్‌(బిఎంఐ) సర్జరీ తర్వాత 28.3కు పడిపోయింది. చాలా మంది డయాబెటిక్‌ రోగులు వ్యాధి నియంత్రణ కోసం మూడు లేదా అంతకుమించిన మందులు వాడుతున్నారు. అయితే స్లీవ్‌ గ్యాస్ట్రెక్టమి చేయించుకున్న డయాబెటిక్‌ రోగులు ఏడాది తరువాత మందులు పూర్తిగా నిలిపివేశారు. సర్జరీకి ముందు రోజూ ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు వేసుకునే 44 శాతం మంది రోగులు ఆ తర్వాత వాటి వాడకాన్ని పూర్తిగా మానేశారని అధ్యయనం వెల్లడించింది. డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులలో చాలామంది గుండె వ్యాధులకు గురవుతున్నారు. కాగా, స్లీవ్‌ గ్యాస్ట్రెక్టమి చేయించుకున్న రోగులలో మంచి కొలెస్ర్టాల్‌(హెచ్‌డిఎల్‌) పెరగడం ప్రారంభం కావడంతోపాటు రక్త నాళాలలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోయాయని కూడా తేలింది.
సర్జరీ విధానం 
స్లీవ్‌ గ్యాస్ట్రెక్టమి ఆపరేషన్‌ను లాప్రోస్కోపిక్‌ విధానంలో చేస్తారు. అన్నాశయంలో అధిక భాగాన్ని తొలగించి ఒక చిన్న అరటి పండు ఆకారంలో చిన్న సంచిగా తయారు చేస్తారు. దీనివల్ల కొంచెం ఆహారం తీసుకున్నా ఆ చిన్న సంచి నిండి కడుపు నిండిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. అధిక ఆహారం తీసుకుని స్థూలకాయంతో బాధపడే భారతీయులకు స్లీవ్‌ గ్యాస్ట్రెక్టమి చక్కని చికిత్సా విధానమని చెప్పవచ్చు. ఇతర సర్జరీలైన రూక్స్‌-ఎన్‌-వై లాంటి పద్ధతులతో పోలిస్తే ఇది చాలా ఉత్తమమైనదని చెప్పాలి. ఈ సర్జరీలో అన్నాశయం పరిమాణంలో మార్పే తప్ప ఇతర జీర్ణక్రియ వ్యవస్థంతా యథాతథంగా ఉంటుంది. లాప్రోస్కోపిక్‌ పద్ధతిలో చేయడం వల్ల రోగి 24 గంటల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కావచ్చు. తీసుకునే ఆహారంలో కాని, జీర్ణమయ్యే పద్ధతిలో కాని ఎటువంటి మార్పు ఉండదు. 
నో సైడ్‌ఎఫెక్ట్స్‌
సాధారణంగా సర్జరీ జరిగిన తర్వాత కొన్ని రకాల దుష్ప్రభావాలు ఏర్పడుతుంటాయి. బేరియాట్రిక్‌ సర్జరీల్లో మరొక పద్ధతి అయినటువంటి గ్యాస్ట్రిక్‌బ్యాండ్‌లో అన్నాశయ పరిమాణాన్ని తగ్గించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో మన శరీరానికి అపరిచితమైన వస్తువును శరీరం లోపలకు పంపించడం జరుగుతుంది. అయితే స్లీవ్‌ గ్యాస్ట్రెక్టమి సర్జరీలో ఇటువంటి పరిస్థితి ఉండదు. అన్నాశయంలో అధిక భాగాన్ని తొలగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు తలెత్తే అవకాశమే ఉండదు. మామూలుగా సర్జరీల తర్వాత తలెత్తే అల్సర్లు, విటమిన్‌ లోపాలు, జీర్ణాశయ ఇబ్బందులు వంటివి ఇందులో ఏర్పడే అవకాశమే లేదు. తీసుకునే ఆహారం పరిమాణం తగ్గిపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ అంతకుముందు కన్నా చక్కగా పనిచేస్తుంది. 
గాయాలకు నో ఛాన్స్‌
సర్జరీలంటే పెద్ద పెద్ద గాట్లు పెట్టి చేసేదన్న అపోహ ఉంది. అయితే స్లీవ్‌ గ్యాస్ట్రెక్టమి సర్జరీలో ఒకే పెద్ద గాటు కాకుండా అర సెంటీమీటర్‌ నుంచి 1.2 సెంటీమీటర్ల పరిమాణంలో ఉండే చిన్న చిన్న రంధ్రాలు నాలుగైదు పొట్ట భాగంలో వేయడం జరుగుతుంది. ఇవి త్వరగా మానిపోవడమే కాకుండా, ఎటువంటి నొప్పి ఉండవు. సర్జరీ చేయించుకున్న వారు తమ దైనందిన జీవితంలోకి త్వరగా వెళ్లవచ్చు.
సర్జరీ తరువాత
స్లీవ్‌ గ్యాస్ట్రెక్టమి సర్జరీ చేయించుకున్న రోగులు ఆహార నియమాలు పెద్దగా పాటించాల్సిన అవసరం లేదు. అయితే తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి. నిత్యం అధిక డోసేజ్‌లలో ఇన్సులిన్‌ తీసుకునే డయాబెటిక్‌ రోగులకు ఈ సర్జరీ చక్కని పరిష్కారాన్ని అందచేస్తుంది. ఇన్సులిన్‌ అవసరాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుంది. 
 
డాక్టర్‌ జి. సురేష్‌చంద్ర హరి 
లాప్రోస్కోపిక్‌ అండ్‌ జనరల్‌ సర్జన్‌, 
ఒబేసిటి సర్జరీ స్పెషలిస్ట్‌
బీమ్స్‌ హాస్పిటల్‌, జూబ్లీహిల్స్‌,
రోడ్‌ నెంబర్‌ 1, హైదరాబాద్‌ 
ఫోన్స్‌:8886112222,
040-39417700