ప్రీ-డయాబెటిస్‌ దశలో ఇలా చేస్తే.. వ్యాధిని నియంత్రించవచ్చు!

మధుమేహం పూర్తిస్థాయిలో తిష్ఠవేసిన తరువాయి పరిస్థితి వేరు. ఆ దశలో వైద్య చికిత్సలు అనివార్యమే అవుతాయి. అయితే, మధుమేహం ఛాయలు అప్పుడప్పుడే మొదలవుతున్న ప్రీ-డయాబెటిస్‌ దశలో మాత్రం వ్యాధిని నియంత్రించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు పరిశోధకులు. మితాహారం తీసుకోవడం, శరీరం బరువు పెరగకుండా చూసుకోవడం, నిద్రకు సరిపడా సమయాన్ని కేటాయించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎవరైనా పాటించాల్సినవే! మధుమేహులకైతే, మరీ తప్పనిసరి! అయితే, ప్రీడయాబెటిస్‌ వ్యక్తులు అందరిలా రోజుకు ఒకసారి మాత్రమే వ్యాయామం చేయడం కాకుండా, రోజుకు మూడు దఫాలుగా చేయడంలో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నొక్కి చెబుతున్నారు. 

 
అంటే... బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ మాదిరిగానే వ్యాయామం కూడా రోజులో మూడుసార్లు 15 నిమిషాల పాటు చేసే,్త షుగర్‌ నిల్వలు అదుపులో ఉంటాయని చెబుతున్నారు. పోస్ట్‌ బ్లడ్‌ షుగర్‌ స్థాయి ఎక్కువగా ఉంటే ఆ ప్రభావం ఫాస్టింగ్‌ షుగర్‌ స్థాయి పైన కూడా పడుతుంది. అందువల్ల పోస్ట్‌ బ్లడ్‌ షుగర్‌ నిల్వల్ని నియంత్రించడం ఒక వివేకవంతమైన పని అవుతుంది. అలా చేయకపోతే, భోజనం చేసి ఓ గంటన్నర ఆగి, షుగర్‌ పరీక్షలు చేయించుకుని ‘అమ్మో ఇంత షుగరా?’ అంటూ దిగులుపడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే, మూడు పూటలా తిన్న వెంటనే కాసేపు వాకింగ్‌ చేస్తే, షుగర్‌ నిల్వలు బాగా అదుపులో ఉంటాయని వారు పేర్కొంటున్నారు. అయితే అలా మూడు సార్లూ వాకింగ్‌కు వెళ్లడం అందరికీ సాధ్యం కాకపోవ చ్చు. అలాంటి వాళ్లు రోజుకు ఒకసారి ఓ 45 నిమిషాల వాకింగ్‌తో సర్దుకోవచ్చు. కానీ, మూడు పూటలా వాకింగ్‌ చేయడలోనే షుగర్‌ నిల్వలు బాగా నియంత్రణలో ఉంటున్నాయని పరిశోధ కులు కనుగొన్నారు. ఈ విధానం వయసు పైబడిన వారికి మరింత అనుకూలంగా ఉంటుంది.