షుగర్‌ రోగులకు ఇన్సులిన్‌ పిల్‌!

బోస్టన్‌, జూన్‌ 27: షుగర్‌ వ్యాధి ఒక స్టేజ్‌ దాటితే ఇంజెక్షన్‌ (ఇన్సులిన్‌) చేసుకోవాల్సిందే. బాధ కలిగినా తప్పదు. అయితే ఈ బాధ నుంచి షుగర్‌ రోగులకు ఉపశమనం కలిగిస్తూ శాస్త్రవేత్తలు ‘ఇన్సులిన్‌ పిల్‌’ను ఆవిష్కరించారు. ‘సూది నొప్పికి భయపడి చాలా మంది ఇన్సులిన్‌ అనగానే ఇబ్బంది పడతారు. నీడిల్‌ ఫోబియా కూడా ఇందుకు ఒక కారణం. కానీ తప్పదు’ అని ఈ పరిశోధనలో పాల్గొన్న భారత శాస్త్రవేత్త సమీర్‌ మిత్రగోత్రి తెలిపారు.

హార్వర్డ్‌ జాన్‌ ఏ పాల్సన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ అప్లయిడ్‌ సైన్సె్‌సలో సమీర్‌ ప్రొఫెసరు. చోలిన్‌, జెరనిక్‌ యాసిడ్‌లతో కలిసి ఉండే ఐకానిక్‌ లిక్విడ్‌ ఇన్సులిన్‌ క్యాప్సుల్‌లో ఉంటుంది. మందు దెబ్బతినకుండా తగినంత వాతావరణంలో రెండు నెలలపాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ మందు ఒక స్విస్‌ కత్తిలా అన్ని ఆటంకాలను అధిగమిస్తూ పనిచేస్తుందని సమీర్‌ తెలిపారు. ‘పేగుల్లోకి ఇన్సులిన్‌ వెళ్లగానే ప్రొటీన్‌లను నశింప చేసే ఏంజైమ్‌లు చిన్నపాటి అమినో యాసిడ్‌లుగా మారిపోతాయి’ అని ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించిన అమ్రిత బెనర్జీ తెలిపారు. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది.