మధుమేహులు తినేయొచ్చు!!

09-04-2019: మధుమేహం ఉందని తెలిస్తే చాలు. ఆహారపరంగా దాదాపు అన్నీ మానేయాలి అన్నట్లే అందరూ చెబుతుంటారు. అయితే ఒకేసారి ఎక్కువ మోతాదులోనో తినేయడం తగదేమో కానీ, మరీ తగ్గిస్తే ఎలా? ఆహారం తగ్గించినప్పుడు కండరాలన్నీ బలహీనపడితే షుగర్‌ సంబంధిత జీవక్రియలూ కుంటపడతాయి. ఫలితంగా, షుగర్‌ నిల్వలు మరింత పెరుగుతాయి. నిజానికి, ఎంతో మంది వద్దని చెబుతున్న కొన్ని ఆహార పదార్థాల్లో ఆ స్థాయి హాని కలిగించే అంశాలేమీ లేవు. ముఖ్యంగా.....
 
నెయ్యి.....
కొన్ని రకాల కొవ్వు పదార్థాలను ఆహారంలో కొంత అదనంగా చేర్చడం ద్వారా శరీరంలోని గ్లూకోజ్‌ నిల్వలు తగ్గుతాయనేది, న్యూట్రిషన్‌ సైన్స్‌ ఎప్పుడూ చెబుతున్నదే. ప్రత్యేకించి, భోజనంలో నెయ్యి వేసుకోవడం ఒకటి. నెయ్యి వల్ల రక్తంలో గ్లూకోజ్‌ తగ్గడంతో పాటు, ఇన్సులిన్‌ మరింత శక్తివంతంగా పనిచే స్తుంది. విశేషించి పాల ఉత్పత్తుల్లోని కొవ్వు పదార్థాలకు శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించే గుణం ఉంది. వాటిల్లో మరింత విలక్షణమైనది నెయ్యి. ప్రత్యేకించి ఆవు నెయ్యికి శరీరం బరువును తగ్గించే గుణం కూడా ఉంది.
 
అరటి పండ్లు...
అరటి పండు ఎన్నో రకాల పోషకాలకు నిధిలాంటిది. దీనిలోని పీచుపదార్థానికి శరీరంలోని మలినాలను తొలగించే గుణం ఉంది. అరటిపండులో ఉండే కొన్ని ప్రిబయోటిక్స్‌కు గ్లూకోజ్‌ నిల్వలను తగ్గించే గుణం ఉంది. దీని వల్ల, మధుమేహులు తమ ఆహారంలో ఒక పూటైౖనా అరటి పండు చేర్చుకోవడం ఎంతో అవసరం.