హార్మోన్‌ సమస్యలకు సంపూర్ణ చికిత్స

10/12/14

 
హార్మోన్‌ల అసమతుల్యత వల్ల హైపో థైరాయిడ్‌, పీసీఓడీ, సంతానలేమి, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. మనిషి శరీరాన్ని ప్రభావితం చేసే హార్మోన్‌ల సమస్యలను హోమియోలోని జెనెటిక్‌ కాన్‌స్టిట్యూషనల్‌ సిమిలిమమ్‌ పద్ధతుల ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చంటున్నారు హోమియో వైద్యనిపుణులు డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్‌. 
హార్మోన్‌లు పాలిసెప్టెడ్‌తో నిర్మితమైన రసాయన వాహకాలు. ఇవి శరీరంలోని ఒక ప్రాంత కణజాలం, అవయవాల నుంచి ఉత్పత్తి అయి, వివిధ శరీర భాగాలకు రక్తం ద్వారా ప్రవహించి నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేసి, జీవక్రియల సమతుల్యతకు తోడ్పడతాయి. ఎండోక్రైన్‌, ఎక్సోక్రైన్‌ గ్రంఽథుల నుంచి ఉత్పత్తిఅయ్యే హార్మోన్‌లు జీర్ణక్రియ, శ్వాసక్రియ, శారీరక, మానసిక ఎదుగుదల ప్రత్యుత్పత్తి, మానసిక సమతుల్యత మొదలగు జీవక్రియలకు తోడ్పడతాయి. హార్మోన్‌ల అసమతుల్యత వల్ల వచ్చే జబ్బులేమిటో తెలుసుకుందాం. 
థైరాయిడ్‌ హార్మోన్లు : థైరాయిడ్‌ గ్రంధి అసమతుల్యత వల్ల హైపోథైరాయిడ్‌, హైపర్‌ థైరాయిడ్‌, గాయిటర్‌ అనే దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి. బరువు పెరగటం, జుట్టు రాలడం, నీరసం, మతిమరుపు, రుతుచక్ర సమస్యలు హైపోథైరాయిడ్‌ లక్షణాలు. బరువు తగ్గడం, గుండెదడ, కాళ్లు, చేతులు వణకడం హైపర్‌ థైరాయిడ్‌ లక్షణాలు.గొంతు కింద ఉండే థైరాయిడ్‌ గ్రంధి వాపునకు గురవటాన్ని గాయిటర్‌ అంటారు. అయోడిన్‌ లోపం వల్ల ఇది వస్తుంది. 
హోమియో వైద్యం : మారిన జీవనశైలి, అధిక ఒత్తిడి వల్ల వచ్చే థైరాయిడ్‌ సమస్యలకు మూలకారణాన్ని గుర్తించి హోమియో వైద్యంతో థైరాయిడ్‌, హార్మోన్‌ సమస్యలను నయం చేయవచ్చు. 
స్త్రీలలో హార్మోన్‌ సమస్యలు : ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌, పొలాక్టిన్‌, అక్సిటాసిన్‌ హార్మోన్‌లు స్త్రీలలో రజస్వల, రుతుచక్రం, సంతానోత్పత్తి, ప్రసవంలో ఉపకరిస్తాయి. ఈ హార్మోన్‌ల అసమతుల్యత వల్ల స్త్రీలలో రుతుచక్ర సమస్యలు, అవాంచిత రోమాలు, సంతానలేమి సమస్యలు వస్తాయి. మెనోపాజ్‌లో హార్మోన్‌ల హెచ్చుతగ్గుల వల్ల మానసిక అశాంతి, నీరసం, కీళ్లు, కండరాల నొప్పులు వస్తాయి. 
టెస్టోస్టిరాన్‌: పురుషుల్లో ఉండే ఈ హార్మోన్‌ అసమతుల్యత వల్ల శీఘ్రస్ఖలనం, అంగస్తంభన, శుక్రకణ, సంతానలేమి సమస్యలు వస్తాయి.
హోమియో వైద్యం : హోమియో వైద్యంతో హార్మోన్‌ల అసమతుల్యతను సరిచేయడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా రుతుచక్ర సమస్యలు, పీసీఓడీ, సంతానలేమి, శుక్రకణ సమస్యలను నయం చేయవచ్చు.
డయాబెటిస్‌ సమస్యలు : యాంటీ డైయూరెటిక్‌ హార్మోన్‌ లోపం వల్ల అతిమూత్రవ్యాధి వస్తుంది. క్లోమగ్రంధి ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ లోపం వల్ల డయాబెటిస్‌ మెల్లిటస్‌ వస్తుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తి కాకపోవడం వల్ల టైప్‌ 1 డయాబెటిస్‌ వస్తుంది. 30 సంవత్సరాల పైబడిన వారిలో ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గడం వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ వస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులు చక్కెర శాతాన్ని సరిగ్గా నియంత్రించుకోకపోవటం వల్ల దీర్ఘకాలంలో డయాబెటిస్‌ నెఫ్రోపతి, డయాబెటిక్‌ న్యూరోపతి, రెటినోపతి, గుండెసమస్యలు వస్తాయి.
హోమియో పరిష్కారం : డయాబెటిస్‌ను త్వరగా గుర్తిస్తే తొలిదశలో హోమియోలోని కాన్‌స్టిట్యూషనల్‌ విధానం ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా వ్యాధిని అదుపులో ఉంచవచ్చు.  దీనివల్ల వచ్చే ఇతర వ్యాధులను కూడా నివారించవచ్చు.
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లవార్‌ (సీఎండీ)
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ ప్ర్తె.లి.
 ఫోన్‌ : 9550001199/88
టోల్‌ ఫ్రీ : 1800 102 2202