దంతాల మెరుపు కోసం...

05-07-2017:దంతాల మీద మచ్చలు వచ్చే ఫుడ్స్‌ తింటే వెంటనే బ్రష్‌ చేసుకోవాలి. దంత వైద్యుని సలహాతో మంచి బ్లీచింగ్‌ ఏజెంట్‌ను వాడాలి.

కాఫీ, టీలు, కోలాలు లాంటివి తాగినపుడు, డార్క్‌ ఫుడ్స్‌ తిన్నప్పుడు బ్రష్‌ చేసుకునే వీలు లేకపోతే ఒక యాపిల్‌ తింటే మంచిది. ఇది మంచి క్లీనింగ్‌ ఏజెంట్‌.
దంతాల్లోని బాక్టీరియా పోవాలంటే కనీసం రెండు నిమిషాలపాటు తప్పనిసరిగా బ్రష్‌ చేసుకోవాలి.
చాలామంది టీ తరచూ తాగుతుంటారు. ఇందులో ఫ్లోరైడ్‌ బాగా ఉంటుంది. అందుకే రోజుకు ఒక్కసారి మాత్రమే టీ తాగితే మంచిది.
దంతాల మీదున్న మచ్చలు పోయి అవి తళ తళ మెరవాలంటే వారానికి ఒకసారి వంటసోడాతో పళ్లను తోముకోవాలి.
ఇంట్లో లేదా ఆఫీసులో పనిలో ఉన్నప్పుడు గంటకొకసారి తప్పనిసరిగా ఒక గ్లాసుడు నీళ్లు తాగాలి. ఎన్ని నీళ్లు ఎక్కువ తాగితే నోటిలోని బాక్టీరియా అంత ఎక్కువగా పోయి నోరు, దంతాలు శుభ్రంగా ఉంటాయి.
దాల్చినచెక్కతో చేసిన చూయింగ్‌ గమ్‌ నమిలితే నోటిలోని బాక్టీరియా పోతుంది.