మెరిసిపోండి!

18-08-2017:దంతాలు ముత్యాల్లా మెరుస్తుంటే...అది మన ముఖానికి మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే ఆరోగ్యమైన, మెరిసే దంతాలకు కొన్ని టిప్స్‌ పాటించండి. అవి...
 
రోజుకు రెండుసార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలి.
దంతాలు దెబ్బతినకుండా డిసెన్సిటైజ్‌ టూత్‌పేస్టును వర్షాకాలంలో వాడాలి.
చక్కెర పదార్థాలు, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌, ప్రిజర్వేటివ్స్‌ వినియోగాన్ని తగ్గించాలి.
టూత్‌బ్ర్‌షలను రెండు నెలలకొకసారి మారుస్తుండాలి. అలా కాకుండా పాత బ్రష్‌నే వాడడం వల్ల పళ్ల సందుల్లో, నోటి లోపల ఇరుక్కుపోయిన ఆహారపదార్థాలు బయటకు పోకుండా అలాగే ఉండి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి.
పోషకాహార పదార్థాలు, సీజనుకు తగిన డైట్‌ తీసుకోవాలి. వర్షాకాలంలో రకరకాల ఫ్రూట్స్‌ దొరుకుతాయి. వాటిని తింటే కావల్సిన పోషకాలు దంతాలకు అందుతాయి. అలాగే సూప్స్‌ తాగితే మంచిది. బాదం, మొక్కజొన్నపొత్తులు, స్ట్రా్ట్రబెర్రీలు బాగా తినాలి. 
చిగుళ్ల నుంచి రక్తం కారకుండా సి-విటమిన్‌, యాంటాక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉన్న ఫుడ్స్‌ తినాలి. అలాగే పైనాపిల్‌, కీరకాయల్లాంటివి తింటే దంతాలు పటిష్ఠంగా ఉంటాయి.
పిల్లలకైతే దంతాలు దెబ్బతినకుండా మౌత్‌గార్డు వాడాలి.
షుగర్‌ బాగా ఉండే స్పోర్ట్సు డ్రింకులు తాగితే అందులోని యాసిడ్‌ దంతాలను దెబ్బతీస్తుంది. అందుకే వాటికి బదులు కొబ్బరి నీళ్లు, తాజా పళ్లరసం తీసుకోవాలి.
నాన్‌ -ఆల్కహాల్‌ మౌత్‌వా్‌ష వాడితే నోరు శుభ్రంగా ఉంటుంది.
వేడి వేడిగా కాఫీ, టీ, సూపులను తాగొద్దు. అలా తాగితే దంతాల సున్నితత్వం దెబ్బతింటుంది.
దంతాల నొప్పి తగ్గకుండా బాధిస్తుంటే వెంటనే దంతవైద్యుని సంప్రదించాలి.