చిగుళ్ల వ్యాధులను నివారించవచ్చు

ఆంధ్రజ్యోతి, 24/01/2014: చిగుళ్ల వ్యాధులు ఆత్మన్యూనతకు గురిచేస్తాయి. అందమైన నవ్వు, పలు వరుసు ఉన్నప్పటికీ చిగుళ్ల వ్యాధులు ఉంటే మాత్రం ఆ అందం వృథానే. ఇష్టమైన కూల్‌డ్రింక్‌గానీ, వేడి వస్తువులు గానీ తినలేని పరిస్థితులు ఎదురవుతాయి. చిగుళ్ల వ్యాధిని నిర్లక్ష్యం చేసినా, సరైన వైద్యం చేయించుకోకపోయిన చివరికి దంతాలను కోల్పోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే చిగుళ్ల వ్యాధులకు తమ వద్ద చక్కని వైద్యం ఉందని చెబతున్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్‌ సురేష్‌. 

చెట్టుకు వేరు ఎంత ముఖ్యమో పంటికి కూడా పన్ను వేరు అంతే ముఖ్యం. ఐతే వేరుకు పటుత్వాన్నిచ్చే చిగురుకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఆ చిగురును జాగ్రత్తగా సంరక్షించుకుంటేనే దంతం, వేరు ఆరోగ్యం, పటుత్వం సంరక్షించుకున్నట్టు.
 
కారణాలు: ముందుగా చిగురును దెబ్బతీసే విషయాలేంటో తెలుసుకుందాం. 
పళ్ల మీద ఏర్పడిన గార ముందుగా చిగురుకు, పంటికి మధ్య సంబంధాన్ని, పటుత్వాన్ని తగ్గిస్తుంది. 
ఈ గారతో బ్యాక్టీరియా కలిసి చిగురును అనారోగ్యకరంగా చేయడం ప్రారంభమవుతుంది. ఈ దశను ‘జింజువైటిస్‌’ అంటారు. ఈ జింజువైటిస్‌ దశలో రోజు బ్రష్‌ చేసేటప్పుడు మన చిగుళ్ల నుండి రక్తం కారడం చిగుళ్లలో కాస్త నొప్పి ఉండటం గమనించవచ్చు.
 
తరువాత దశలో బ్యాక్టీరియా చిగురును కిందకు తోసివేస్తూ వేరు భాగంను బయటకు కనిపించేలా చేస్తాయి. ఈ విధంగా రావడం వల్ల పళ్లమధ్యలో ఉన్న ఎముక భాగాన్ని కూడా తినేస్తాయి. దానివల్ల పళ్ల కదలిక మొదలవడానికి అవకాశాలున్నాయి.
 
ఈ దశను ‘పెరియోడాంటెటిస్‌’ అంటారు. ఈ దశలో చిగుళ్లు వదులుగా అయి ఎముక పాడవడం వల్ల మనం తినే చల్లని, వేడి పదార్థాలు వేరు భాగాన్ని తాకడం వల్ల పళ్ల తీపులు ఎక్కువగా ఉంటాయి. ఈ దశ దాటితే పళ్లు బాగా వదులవడం, బాగా ఊగుతూ ఉండటం, ఊడిపోవడం వంటివి జరుగుతాయి. 
ఈ చిగుళ్ల వ్యాధికి కారణం ముఖ్యంగా దంత సంరక్షస్త్ర. కాకపోతే మధుమేహ వ్యాధి ఉన్నవారిలో ఈ చిగుళ్ల జబ్బు వచ్చే అవకాశం చాల ఎక్కువ. సాధారణ ఆరోగ్యవంతుల్లో 45 ఏళ్లకు చిగుళ్ల జబ్బు వస్తుందనుకుంటే మధుమేహ వ్యాధి ఉన్నవారిలో ఇది 35ఏళ్లకే రావచ్చు.
 
చిన్న వయసులోనే అంటే...పాతికేళ్ల లోపే నమిలే దంతం గణనీయంగా అరిగిపోయి లోపలి డెంటిస్‌ బయటపడటం...తీవ్రమైన జింజివైటిస్‌తో పాటు తరుచుగా చిగుళ్ల నుండి రక్తసస్రావం జరుగుతుండటం...దీనికి వయసు, బరువు, కుటుంబ నేపథ్యం కూడా తోడైతే మధుమేహం ఉండొచ్చని తప్పకుండా అనుమానించాల్సిందే. 
నివారణ: దంత సంరక్షణ నియమాలు, క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సంప్రదిస్తూ నివారణ చర్యలు తెలుసుకుంటూ ఉండాలి. 
దంత సంరక్షణ అంటే బ్రష్‌ రోజూ రెండు సార్లు చేయడం. 
ఫ్లాసింగ్‌ చేసుకోవడం(పళ్ల మధ్య సందులను శుభ్రపరుచుకోవడం). 
ఏదైనా తిన్న వెంటనే నోటిని పుక్కిలించుకోవడం. 
ప్రతిరోజూ పంటికి సంబంధించిన అన్ని భాగాలు, అన్ని వైపులా శుభ్రపడ్డాయో లేదో చూసుకోవడం. గార పట్టకుండా చూసుకోవడం. 
దంతాలను బ్రష్‌తో శుభ్రపరిచేటప్పుడు అడ్డంగా కాకుండా, వృత్తాకారంగా బ్రష్‌ చేయడం. బలంగా కాకుండా ఒక మాదిరిగా చేయాలి.

చికిత్స: 
చిగుళ్ల వ్యాధికి మొదటి దశలో ఉంటే..అంటే ‘జింజివైటిస్‌’ దశలో ఉంటే చికిత్స చాలా సులభం. స్కేలింగ్‌ ద్వారా గార తొలగించి సరిచేయవచ్చు. 
రెండవ దశ పిరియోడాంటైటిస్‌లో మొదట గారను తొలగించి, తరువాత వేరు భాగాన్ని కూడా ‘రూట్‌ ప్లానింగ్‌’ ద్వారా సరిచేయవచ్చు. ఇంకా తీవ్రంగా ఉంటే ఫ్లాప్‌ సర్జరీ ద్వారా సరిచేసి ఎముక బలహీనంగా ఉంటే ‘బోన్‌ గ్రాఫ్టింగ్‌’ను కూడా చేసి సరిచేయవచ్చు.
 
ఫ్లాప్‌ సర్జరీ అంటే దంతం కింద ఉండే చిగురును పైకి లేపి శుభ్రపరిచి, అవసరమైతే బోన్‌గ్రాఫ్ట్‌ అనే ఎముక పొడిలాంటి పొడిని పెట్టి యథాస్థానంలో పెట్టి కుట్టేస్తారు. ఈ చికిత్సకు ముందు నొప్పి తెలియకుండా మత్తుమందు ఇస్తారు. 
ఇవన్నీ కాకుండా మీరు దంత వైద్యుడిని సంప్రదించినప్పుడు మీ చిగుళ్ల పరిస్థితిని అంచనా వేసి దానికి కావల్సిన సరైన చికిత్సా విధానాన్ని మీకు అందిస్తారు డాక్టర్లు. తద్వారా మీరు సరైన చికిత్సను పొందవచ్చు. 

డాక్టర్‌ సురేష్‌, ఎండీఎస్‌, 
స్టార్‌ డెంటల్‌ 
సికింద్రాబాద్‌, దిల్‌షుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి
www.stardentalcares.com
 
కూకట్‌పల్లి ఫోన్‌: 7416 105 105, 90300 854 56