స్టీమేడ్‌ .. ఇది దంతాల మూలకణ బ్యాంకు

ఆంధ్రజ్యోతి,20-11-13
మూలకణాల నిల్వ వైద్యరంగంలో ఎన్నో ప్రయోగాలకు, వ్యక్తిగతంగా స్టెమ్‌సెల్‌ ఽథెరపీకి ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఇప్పుడు కొత్త విషయం ఏమిటంటే, దంతాల నుంచి మూలకణాలను సేకరించడం, వాటిని నిల్వ చేయడం! ఆ కార్యక్రమంలో బిజీగా ఉంది స్టిమేడ్‌. ఇదే మన దేశంలోని తొలి ‘డెంటల్‌ స్టెమ్‌సెల్‌ బ్యాంక్‌’. నవంబర్‌ 2010 నుంచి ముంబై, ఢిల్లీలో మొదలైన స్టిమేడ్‌ సేవలు వేగంగా అన్ని పట్టణాల్లోకి విస్తరించనున్నాయి.

 

పుట్టినప్పుడు సాధారణంగా బొడ్డు నాళాల రక్తం నుంచి మూల కణాలనుసేకరించే అవకాశం ఉంది. అయితే అప్పుడు స్టెమ్‌సెల్స్‌ను తీయనివారికి ఈ డెంటల్‌ స్టెమ్‌సెల్స్‌ బ్యాంక్‌ అద్భుతమైన అవకాశం. అప్పుడు తీసిన వాళ్లకు కూడా మరో అవకాశం లాంటింది. స్టెమ్‌సెల్స్‌ను దంతాల నుంచి కూడా సేకరించవచ్చు. పాలపళ్ల నుంచి జ్ఞానదంతాల వరకు అన్ని స్థాయిల్లోని దంతాల్లోనూ స్టెమ్‌సెల్స్‌ లభ్యం అవుతాయి. ఇంతకీ స్టెమ్‌సెల్స్‌ నిల్వ వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?

   ఎముకలు, కార్టిలేజ్‌, కాలేయం, డయాబెటిస్‌, ఆర్థరైటిస్‌ వంటి అనేక ‘కణాలు, అవయవ సంబంధ వ్యాఽధుల’ నివారణలో, నియంత్రణలో స్టెమ్‌సెల్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాదు, మూలకణ పరిశోధనలకు అవి ఎంతో ఉపయోగపడుతాయి. మూల కణాల నిల్వ వల్ల వంశస్తుల్లో సంభవించే అనేక వ్యాధులు, ఇతరత్రా ఆరోగ్య సంబంధ సమస్యలకు త్వరగా పరిష్కారం కనుక్కోవచ్చు. ఆ స్టెమ్‌సెల్‌ థెరపీతో డయాబెటిస్‌, పార్కిన్సన్‌, వెన్నెముక గాయాలు, ఎం.ఐ, ఎం.ఎస్‌, ఆస్టియోఆర్థరైటిస్‌ వంటి అనారోగ్య లక్షణాలను నివారించవచ్చు. 

   చాలామందికి దంతాల నుంచి స్టెమ్‌సెల్స్‌ను తీయడం ప్రమాదం లేదా బాధాకరం అనే సందేహం కలుగవచ్చు. కానీ, ఆ ప్రక్రియ చాలా సులభమైనది. చిన్నపిల్లల్లో కొత్త దంతాలు రావడానికి ముందు సహజంగా ఊడిపోయిన దంతాల నుంచి కూడా వీటిని సేకరించవచ్చు. ఇది ఎలాంటి బాఽధా కలుగని పద్ధతి. పది నిమిషాల్లో జరిగిపోయే పని. యువకులైతే జ్ఞానదంతం తీసినప్పుడు ఈ బ్యాంకును సంప్రదిస్తే సరిపోతుంది. మూలకణాలు సేకరించిన తరువాత వాటిని ఆ బ్యాంకులో 150 డిగ్రీల తక్కువ టెంపరేచర్‌లో ఉండే క్రయోజెనిక్‌ ట్యాంకుల్లో నిల్వచేస్తారు. 

   స్టిమేడ్‌ మొదలైన కొత్తలో డాక్టర్ల కోసం ఎన్నో ఎడ్యుకేషనల్‌ డ్రైవ్‌లు, అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్స్‌ చేపట్టింది. గత 20 నెలల్లోనే సుమారు 300 కంటిన్యూయస్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించింది. చెన్నై, బెంగళూర్‌, హైదరాబాద్‌, పుణే వంటి అన్ని మెట్రోప్రాంతాల్లో 2000 మంది డాక్టర్ల సహకారంతో ఇప్పటి వరకు సుమారు 500 దంతాల సేకరణ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్టిమేడ్‌ సామర్థ్యాన్ని, స్థాయిని పెంచాలనే యోచనలో ఉన్నారు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ గాద్రే. 50 పట్టణాలకు తమ సేవలు విస్తరించాలనే ప్రణాళికలో భాగంగా ఇప్పటికే చండీగఢ్‌, లూథియానా, అంబాలా, నాసిక్‌, నాగపూర్‌, సేలం వంటి నగరాల్లో స్టిమేడ్‌ సేవలు కొనసాగుతున్నాయి.