దంతాలు మెరిసే!

01-04-2019: ఎంత శుభ్రత పాటించినా దంతాలు రంగు మారడం సహజం. ఆహారపు అలవాట్ల వల్ల దంతాలు పసుపుపచ్చగా మారతాయి. అయితే ఈ పసుపు పొరను తొలగించి, తిరిగి దంతాలను ముత్యాల్లా మెరిపించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
బేకింగ్‌ సోడాలో హైడ్రోజెన్‌ పెరాక్సైడ్‌ కలిపి పేస్ట్‌లా చేసి, దాంతో దంతాలు రుద్దుకోవాలి.
భోజనం తర్వాత బేకింక్‌ సోడాలో బ్రష్‌ అద్ది దంతాలు రుద్దుకోవాలి.
 స్ట్రాబెర్రీలు, నీరు ఎక్కువగా ఉండే పచ్చి కూరగాయలు తింటూ ఉండాలి.
 యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌లో దూది ముంచి దంతాలు రుద్దుకుని కడిగేసుకోవాలి.
 కొబ్బరినూనె నోట్లో పోసుకుని పుక్కిలించాలి.
 నిమ్మ తొక్కతో దంతాల మీద రుద్దుకోవాలి.