పంటి వైద్యంలో సంచలనం..

19-10-2017: మీరు పళ్లను ఫిల్లింగ్ చేయించుకుని ఇబ్బందులు పడుతున్నారా? ఇకపై అటువంటి సమస్యలు ఎవరికీ ఎదురుకావు. ఎందుకంటే వైద్యశాస్త్రవేత్తలు దీనికి పూర్తిస్థాయి పరిష్కారమార్గాన్ని కనుగొన్నారు. ‘టైడ్ గ్లూసిబ్’ అనే ఔషధాన్ని తీసుకోవడం ద్వారా పన్ను తిరిగి పెరుగుతుంది. నిజానికి వైద్యులు ఈ ఔషధాన్ని అల్జీమర్ వ్యాధి నివారణ కోసం తయారుచేశారు. అయితే పలు పరీక్షల తరువాత ఈ ఔషధం... పళ్లు తిరిగి పెరిగేందుకు కూడా ఉపయుక్తమవుతుందని వెల్లడైంది. పైగా ఈ ఔషధంతో పళ్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, క్యావిటీలను చక్కదిద్దుతుందని తేలింది. ఈ ‘టైడ్ గ్లూసిబ్’ పంటి చిగుళ్లను ఉత్తేజపరుస్తుంది. దీంతో ఇది పళ్ల పెరుగుదలకు దోహదపడుతుంది. కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు ఈ ఔషధాన్ని రూపొందించారు.