నోటి దుర్వాసనకు దూరం

01-01-2018:పొగాకు నమలటం, దంతక్షయం, పండ్లను సరిగా శుభ్రం చేయకపోవటం లాంటి కారణాల వల్ల నోటి దుర్వాసన వస్తుంది. అలాంటి కారణాలు, లక్షణాలను బట్టి నోటి దుర్వాసనను నివారించే పలు రకాల ఔషధాలు హోమియో వైద్యంలో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి..

 
పల్సటిల్లా: నోటి దుర్వాసనతో పాటు గొంతు పొడిబారిపోవటాన్ని నివారిస్తుంది.
మెర్క్‌ సోల్‌: నోటి దుర్వాసనతో పాటు లాలాజలం అధికంగా ఊరటాన్ని, దంతక్షయాన్ని నివారిస్తుంది.
కార్బోవెజ్‌: నోటి దుర్వాసనతో పాటు ఇన్ఫెక్షన్‌లు, చిగుళ్లవాపు, రక్తం కారటాన్ని తొలగిస్తుంది.
కార్బోలిక్‌ యాసిడ్‌: పొట్ట ఉబ్బరం, మలబద్ధకం వల్ల ఏర్పడే నోటి దుర్వాసన కు మంచి ఔషధం.
క్రెయోసోట్‌: దంతక్షయం, చిగుళ్ల నుంచి రక్తం కారటం వల్ల ఏర్పడే నోటి దుర్వాసనను నివారిస్తుంది.
బెలడోనా: గొంతు ఇన్షెక్షన్ల వల్ల వచ్చే నోటి దుర్వాసనను తొలగిస్తుంది.
నక్స్‌ వామికా: చలితో పాటు ఉండే నోటి దుర్వాసనను నిర్మూలిస్తుంది.
నోటి దుర్వాసనకు కారణమయ్యే ఆరోగ్య సమస్యలు అనేకం. వాటిని నివారించుకోగలిగినా నోటి దుర్వాసన అంతమవుతుంది. అవేంటంటే...
మధుమేహం: మధుమేహుల్లో కనిపించే ప్రధాన లక్షణణం నోరు ఎండిపోతూ ఉండటం. దీంతో నోరు దుర్వాసన వేస్తూ ఉంటుంది. కాబట్టి మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవాలి.
చిగుళ్ల వ్యాధి: జింజివైటిస్‌ అనే చిగుళ్ల వ్యాధిలోనూ నోటి దుర్వాసన ఉంటుంది. చిగుళ్లు వాచి, నొప్పి పెడుతుంటే దంత వైద్యుల చేత చికిత్స చేయించుకోవాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోగలిగితే నోటి దుర్వాసనను వదిలించటం కష్టమేమీ కాదు.