చిగుళ్ల వ్యాధికి ఆధునిక చికిత్సలు

08-01-13

 
మన దేశంలో నూటికి 20 శాతం మంది చిగుర్ల వ్యాధితో బాధపడుతున్నారు. నొప్పి లేకపోవడం వల్ల ఎక్కువ శాతం మంది చివరి వరకు నిర్లక్ష్యం చేస్తున్నారు. చిగుర్ల వ్యాధి తమకు ఉందని ఎలా తెలుస్తుందన్న సందేహం చాలామందికి రావడం సహజం. నోటి నుంచి దుర్వాసన రావడం, చిగుర్ల కింద తిన్న ఆహారం ఇరుక్కుపోవడం, చిగుర్లు వాయడం, బ్రష్‌ చేసేటప్పుడు రక్తం రావడం వంటి లక్షణాలు కనపడితే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలని అంటున్నారు ప్రముఖ డెంటల్‌ సర్జన్‌ డాక్టర్‌ సుధీర్‌ చౌదరి.
 
 
ప్రసాద్‌కు 40 సంవత్సరాలు. ఉద్యోగం చేస్తున్నాడు. మాట్లాడేటప్పుడు నోటి దుర్వాసన వస్తోందని వాళ్లావిడ ఎంతో కాలంగా పోరుపెడుతోంది. ఆఫీసులోని మిత్రులు కూడా ఆ విషయం చెప్పలేక మాట్లాడటం తగ్గించేశారు. లవంగం, వక్కపొడి వేసుకుంటూ నోటి దుర్వాసన బయటపడకుండా ఉండేందుకు ప్రయత్నించేవాడు. కొంతకాలం తరువాత అన్ని పళ్లు చిన్నగా కదలడం మొదలుపెట్టాయి. గట్టి వస్తువులు నమలలేకపోయేవాడు. ఇక తప్పదని దంత వైద్యుడిని సంప్రదించాడు. ఆయన దంతాలను పరీక్షించి చిగుర్ల వ్యాధి అడ్వాన్స్‌ స్టేజ్‌కి చేరుకుందని, 70 శాతం ఎముక క్షీణించిందని, ఎక్కువ కాలం పళ్లు ఉండవు కాబట్టి ఇంప్లాంట్స్‌ ద్వారా ఫిక్సెడ్‌ టీత్‌ కట్టించుకోవాలని చెప్పారు. అయితే పళ్లనీ వాటి అంతట అవే ఊడిపోతేనే ఫిక్సెడ్‌ టీత్‌ కట్టించుకోవాలని ఆయన చెప్పడంతో ప్రసాద్‌ ఆ విషయాన్ని అక్కడితో వదిలేశాడు. నాలుగు సంవత్సరాలలో అన్ని పళ్లు వాటంతట అవే ఒక్కొక్కటి కదిలి ఊడిపోయాయి. ముఖంలో ముడుతలు వచ్చి చాలా మార్పు ఏర్పడింది. ఫిక్సెడ్‌ టీత్‌(ఇంప్లాంట్స్‌) చేయించుకొందామని డాక్టర్‌ని సంప్రదిస్తే ఎక్స్‌రే తీసి చివరివరకు నిర్లక్ష్యం చేయడం వల్ల మొత్తం ఎముక అంతా తినేసిందని, ఫిక్సెడ్‌ టీత్‌ సాధ్యం కాదని తేల్చేశారు. దీంతో ప్రసాద్‌ తీసి పెట్టుకునే పళ్ల సెట్‌ చేయించుకున్నాడు. వాటితో సరిగా నమలలేకపోవడం, ఆహారం తినేటప్పుడు డెంచర్‌ కిందకు ముక్కలు వెళ్లి గుచ్చుకోవడం, మాట స్పష్టత లేకపోవడం వంటి ఇబ్బందులు పడేవాడు. చివరివరకు నిర్లక్ష్యం ఎందుకు చేశానా అని ఇప్పుడు బాధపడుతున్నాడు. ఇది కేవలం ప్రసాద్‌ ఒక్కడి సమస్య కాదు. చిగుర్ల వ్యాధికి సంబంధించి ప్రజలలో ఏర్పడే సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాము.
 చిగుర్ల వ్యాధి అంటే ఏమిటి?
పంటి చిగురు దగ్గర తినే ఆహారం ఇరుక్కుని అది సరిగ్గా శుభ్రం చేసుకోనట్లయితే అది పాచి కింద, గార కింద మారి చిగురు కింద ఉండే ఎముకని తిని వేసే బ్యాక్టీరియాని, ఇన్‌ఫెక్షన్‌ని తయారు చేస్తుంది.
రోజూ ఎక్కువసార్లు బ్రష్‌ చేసుకుంటే ఈ           ఇన్‌ఫెక్షన్‌ రాదా?
ఒకసారి గార ఏర్పడనంత వరకు బ్రష్‌ చేసుకోవడం హెల్ప్‌ అవుతుంది. ఒకసారి గార, ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడిన తర్వాత బ్రష్‌ ఎంత చేసినా పళ్లు అరిగిపోయి పచ్చగా అవడం తప్ప ఫలితం ఉండదు.
 మరి ఈ గార, ఇన్‌ఫెక్షన్‌ ఎలా పోతుంది?
పంటి మీద ఏర్పడిన గార, ఇన్‌ఫెక్షన్‌ని స్కేలింగ్‌ అనే పద్ధతి ద్వారా తొలగిస్తారు. చిగురు కింద ఇన్‌ఫెక్షన్‌ తక్కువగా ఉన్నట్లయితే దానిని డీప్‌ క్లీనింగ్‌ అనే పద్ధతి ద్వారా తొలగిస్తారు. ఎక్కువ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లయితే ప్లాప్‌ సర్జరీ లేదా గమ్‌ సర్జరీ అనే పద్ధతి ద్వారా తొలగిస్తారు.
 ఈ ప్లాప్‌ సర్జరీ లేదా గమ్‌ సర్జరీ ఈ ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటే ఏమవుతుంది?
ఇన్‌ఫెక్షన్‌ నొప్పి లేకుండానే పంటికి ఆధారంగా ఉండే ఎముకను తినివేయడం వల్ల పళ్లు కదిలి ఊడిపోతాయి.
ఈ ప్లాప్‌ లేదా గమ్‌ సర్జరీ నొప్పి ఉంటుందా? షుగర్‌, బిపి ఉన్నా చేయించుకోవచ్చా?
ఒకప్పుడు ఈ గమ్‌ సర్జరీ లేదా ప్లాప్‌ సర్జరీ అనేది చిగుర్లు కట్‌చేసి, ఓపెన్‌ చేసి ఇన్‌ఫెక్షన్‌ అంతా తీసేసి, క్లీన్‌ చేసి మరలా కుట్లు వేసేవారు. దీనికి 4-6 గంటల సమయం పట్టేది. నొప్పి, వాపు ఉండేది. లేజర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత లేజర్‌ గమ్‌ సర్జరీ అనేది ఒక గంట సమయంలోనే పూర్తి అవుతుంది. కోత కుట్లు ఉండవు. ఇంజక్షన్‌ అవసరం ఉండదు. విశ్రాంతి అవసరం లేదు. అదే రోజు ఆఫీసుకు కూడా వెళ్లవచ్చు. షుగర్‌, హార్ట్‌, బిపి పేషెంట్‌ ఎవరికైనా చేయవచ్చు.
 షుగర్‌ పేషెంట్‌కి చిగుర్ల వ్యాధులకు ఏమిటి సంబంధం?
ఆరోగ్యవంతమైన వ్యక్తుల కంటే చిగుర్ల వ్యాధి షుగర్‌ పేషెంట్‌లో మూడు రెట్లు అధికంగా ఉంటుంది. షుగర్‌ పేషెంట్‌కి చిగుర్ల వ్యాధి ఉంటే షుగర్‌ ఎప్పటికీ తగ్గదు. ఒకదాన్ని ఒకటి పెంచుకుంటాయి.
చిగుర్లకు లేజర్‌ చికిత్స తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు?
రోజూ బ్రష్‌ చేసుకోవడం, ప్లాస్‌ చేయడం, ఆరు నెలలకోసారి పళ్లు క్లీన్‌ చేసుకోవడం.
 
డాక్టర్‌ సుధీర్‌ చౌదరి
అమీర్‌పేట్‌ సూపర్‌ స్పెషాలిటీ డెంటల్‌ హాస్పిటల్‌
101, క్లాసిక్‌ అవెన్యూ
అమీర్‌పేట్‌, హైదరాబాద్‌
ఫోన్‌: 040-23412125
      9989691114
బ్రాంచ్‌: మాదాపూర్‌