24-11-2017: డాక్టర్! నా నోటి దుర్వాసన వల్ల ఎంతో ఇబ్బందిగా ఉంది. రోజుకి రెండు సార్లు బ్రష్ చేస్తున్నా నోటి దుర్వాసన వదలటం లేదు. ఏం చేయమంటారు?
- జ్యోతి, హైదరాబాద్.
నోటి దుర్వాసనకు కారణాలు అనేకం. మధుమేహం, చిగుళ్లు, దంతాల వ్యాధుల కారణంగా నోటి నుంచి దుర్వాసన వెలువడుతుంది. తగినన్ని నీళ్లు తాగకపోయినా, కొన్ని రకాల మందుల కారణంగా నోరు పొడిబారుతున్నా నోటి దుర్వాసన మొదలవుతుంది. కాబట్టి ఈ కారణాలను గమనించి చికిత్స తీసుకోవాలి. అలాగే రోజుకి 8 గ్లాసుల నీళ్లు తాగటంతోపాటు దంతాలు, చిగుళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తిన్న వెంటనే నీళ్లతో నోరు పుక్కిలించుకుంటూ ఉండాలి.
- డాక్టర్. శంకర్, డెంటిస్ట్, హైదరాబాద్