నోటి పుండ్లు నయమయ్యేదెలా?

06-10-2017: డాక్టర్‌ నాకు నాలుక పైన, బుగ్గల లోపల తరచుగా పుండ్లు ఏర్పడుతుంటాయి. ఇవి తగ్గాలంటే ఏం చేయాలి?
- శ్యామ్‌, విజయవాడ.
జవాబు: నోటి శుభ్రత పాటించకపోయినా, ఒత్తిడి పెరిగినా, విటమిన్ల లోపం ఉన్నా నోటి పుండ్లు వస్తాయి. కాబట్టి నోరు శుభ్రంగా ఉంచుకోవటంతోపాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. మాంసకృత్తులు, పీచు పదార్థం ఎక్కువగా తీసుకోవాలి. తాజా పళ్లతో అవసరమైన విటమిన్లు అందుతాయి. నోటి పుండ్లు తగ్గేవరకూ మల్టీ విటమిన్‌ మాత్రలు వాడటం మేలు.
- డాక్టర్‌ శర్మ, డెంటిస్ట్‌, విజయనగరం