01-02-2019: చక్కని పలువరుస మీ నవ్వును కొనసాగించేలా చేస్తుంది. చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటే మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కిచెన్‌లో లభించే పదార్ధాలతో మీ దంతాలను తళతళలాడేలా చేయొచ్చు. అవేంటో తెలుసుకుందాం.
అరటి పండు: దీని తొక్కలో పళ్లను తెల్లగా మార్చే గుణాలున్నాయి. అరటిపండు తొక్కను పండ్ల మీద ఒక నిమిషం పాటు రుద్దుకోవాలి. అరటి తొక్కలోని పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ పంటి మీది మలినాలను తొలగించి వాటిని తెల్లగా మార్చడమే కాకుండా పంటి ఆరోగ్యానికి దోహదపడుతాయి.
స్ట్రాబెర్రీ: బాగా పండిన స్ర్టాబెర్రీలను తీసుకొని మెత్తని పేస్టుగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌తో పంటి మీద రెండు నిమిషాల పాటు మర్ధన చేయాలి. స్ర్టా బెర్రీలోని మాలిక్ ఆసిడ్ దంతాలకు తెలుపునిస్తుంది. వీటిలోని పీచుపదార్థం పంటి మీది బ్యాక్టీరియాను నిర్మూలించి చిగుళ్ల సంబంధ వ్యాధుల్ని నివారిస్తుంది. దాంతో నోరు, దంతాలు
ఆరోగ్యంగా ఉంటాయి.
క్యారెట్స్: తాజా క్యారెట్లను శుభ్రంగా కడుక్కొని తినాలి. క్యారెట్‌ను కొరికి తినడం ద్వారా దంతాల మీది పాచి, బ్యాక్టీరియాను తొలగిపోతుంది. అంతేకాదు చిగుళ్లు
ఆరోగ్యంగా ఉంటాయి. దాంతో దంతాలు తళతళలాడుతాయి.