మెరిసే పలువరస కోసం...

16-07-2018: దంతాలను మెరిసేలా చేసే వంటింటి చిట్కాలు కొన్ని ఉన్నాయి. వాటిని అనుసరిస్తే మల్లెపూవు తెలుపును సైతం మైమరపించేలా దంతాలు తళ తళ లాడతాయి. ఇంతకూ అవేమిటంటే...
అరటిపండు తొక్కలో ఉండే సన్నని పొరలతో దంతాలను రెండు నిమిషాలు రుద్దుకుంటే బాగా మెరుస్తాయి. వీటిలోని పొటాషియం, మెగ్నీషియం, మాంగనీసు వంటి ఖనిజాలు దంతాల్లోకి ఇంకడం వల్ల వాటికి ఆ మెరుపు వస్తుంది.
స్ట్రాబెర్రీ లేదా స్ట్రాబెర్రీ టూత్‌పేస్టుతో దంతాలు శుభ్రం చేస్తే మెరుస్తాయి.
పాల ఉత్పత్తులు దంతాలు రంగు తగ్గడాన్ని నిరోధిస్తాయి.
యాపిల్స్‌, క్యారెట్లు, ఆకుకూరలు దంతాలపై ఉన్న మచ్చలను పోగొట్టే ఆర్గానిక్‌ టీత్‌ స్టెయిన్‌ రిమూవర్స్‌.
టీ, కాఫీ, సాఫ్ట్‌ డ్రింక్స్‌ తాగేటప్పుడు స్ట్రా ఉపయోగించడం వల్ల దంతాలపై వాటి ప్రత్యక్ష ప్రభావం పడదు. ఫలితంగా దంతాలపై మచ్చలు పడకుండా కాపాడుకోవచ్చు.
హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, బేకింగ్‌ సోడాతో చేసిన లిక్విడ్‌ పేస్టును వాడడం వల్ల దంతాలు తళ తళ మెరుస్తాయి.
తిన్న తర్వాత నీళ్లతో నోటిని బాగా పుక్కిలిస్తే కూడా దంతాలపై మచ్చలు పడవు. మెరుపు తగ్గదు.
తులసి ఆకులు, కమలాపండు తొక్కు రెండింటి మిశ్రమాన్ని బాగా కలిపి దంతాలపై రుద్దితే తళ తళ మెరుస్తాయి.
బేకింగ్‌ సోడాను నిమ్మరసంలో వేసి బాగా కలిపి దంతాలపై రుద్దితే జరిగే రసాయనచర్య వల్ల దంతాలు మెరుపులు చిందిస్తాయి.
ఆలివ్‌ ఆయిల్‌, ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ రెండింటినీ కలిపి, ఆ మిశ్రమంలో టూత్‌బ్ర్‌షను కాసేపు ఉంచాలి. ఆతర్వాత దాంతో దంతాలు తోముకంటే బాగా మెరుస్తాయి.
టూత్‌ వైటనింగ్‌ స్ట్రిప్స్‌ వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి.