సరికొత్త మలేరియా మాత్ర దిశగా..

 

వాషింగ్టన్‌: రెండు వారాల పాటు కడుపులోనే ఉండి ఓ క్రమ పద్ధతిలో మందును విడుదల చేసే సరికొత్త మాత్రను శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ ఆవిష్కరణతో మలేరియా సహా పలు ఇతర వ్యాధుల చికిత్సలో మెరుగైన మాత్రల రూపకల్పనకు మరో ముందడుగు పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మలేరియా వంటి వ్యాధుల్లో కొన్ని రోజుల పాటు మాత్రలు మింగాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అదేపనిగా ఇలా మందులు మింగడం రోగికి ఇబ్బంది. అంతేకాదు, ఇలా తీసుకున్న మాత్రలు కొద్దిసేపు మాత్రమే పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో కడుపులో దీర్ఘకాలంపాటు ఉండి, అవసరాన్ని బట్టి మందు విడుదల చేయడం ద్వారా వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించవచ్చని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) ప్రొఫెసర్‌ రాబర్ట్‌ లాంగర్‌ వివరించారు.