డెంగ్యూను నిరోధించే కొత్త యాంటీబాడి

ప్రాణాంతక డెంగ్యూ వైర్‌సను రూపుమాపే అత్యంత శక్తిమంతమైన ప్రతిరక్షక పదార్థాన్ని ్థ(యాంటీబాడి)శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణతో భవిష్యత్తులో డెంగ్యూ బాధితులకు సమర్థవంతమైన చికిత్సనందించే అవకాశం కలుగుతుందని డ్యూక్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ షీ మెయ్‌ లాక్‌ వివరించారు. ప్రస్తుతం ఆవిష్కరించిన యాంటీబాడీని శాస్త్రవేత్తలు 5జే7 గా వ్యవహరిస్తున్నారు. ఇది ఎంత శక్తిమంతమైనదంటే.. సూక్ష్మ పరిమాణంలోని యాంటీబాడీ కూడా డెంగ్యూ వైర్‌సను అడ్డుకుంటుందట. డెంగ్యూకు ప్రస్తుతం సరియైున చికిత్స కానీ, వైరస్‌ సోకకుండా అడ్డుకునేందుకు తగిన టీకాలు కానీ అందుబాటులో లేవు. తాజా ఆవిష్కరణతో డెంగ్యూకు సమర్థవంతమైన చికిత్సతో పాటూ డెంగ్యూ నిరోధక టీకాను అభివృద్ధి చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.