మలేరియాను సమర్థంగా నిరోధించే వాక్సిన్‌

మలేరియా నివారణలో ప్రభావవంతమైన వాక్సిన్‌ను రూపొందించేందుకు కేవలం మరో అడుగు దూరంలో ఉన్నామని ఆస్ట్రే లియా పరిశోధకులు పేర్కొన్నారు. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పనితీరును నిశితంగా పరిశీలించి ఈ వాక్సిన్‌కు రూపకల్పనకు పూనుకున్నట్లు వారు వివరించారు. యాంటీబాడీలు రక్తంలోని ఇతర ప్రొటీన్లతో కలిసి మలేరియా క్రిమిని ఎదుర్కొనే విధానాన్ని ఈ వాక్సిన్‌ అనుకరిస్తుందని చెప్పారు. ప్రస్తుతం మలేరియాను సమర్థవంతంగా నిరోధించే వాక్సిన్‌ అందుబాటులో లేదని బర్నెట్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రొఫెసర్‌ జేమ్స్‌ బీసన్‌ వివరించారు. వాక్సిన్‌ను వీలైనంత తొందరగా మార్కెట్లోకి తేవాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన వివరించారు.