దోమతోనే డెంగ్యూ నియంత్రణ

 

డెంగ్యూ కారక దోమే ‘లుట్జియా’ దోమ ఆహారం 

కోల్‌కతా, 21-02-2017: దోమకాటుతో వచ్చే డెంగ్యూ వ్యాధిని మరో దోమతోనే నియంత్రించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాధికారక దోమను ఈ కొత్త దోమ చంపేస్తుందని తమ పరిశోధనలో తేలిందన్నారు. ఈమేరకు కలకత్తా యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో లుట్జియా ఫస్కానా అనే దోమ లార్వా దశలో ఉన్నపుడు డెంగ్యూ కారక దోమ లార్వాను ఆహారంగా తీసుకుంటుందని వెల్లడైందని చెప్పారు. ఫస్కానా దోమ లార్వా ఒక రోజులో 19 నుంచి 24 లార్వాలను ఆహారంగా తీసుకోగలదని వివరించారు.