డెంగీ ముప్పును గుర్తించే వ్యవస్థ!

వాతావరణ స్థితిని బట్టి అంచనా

భారత్‌లో యూకే వర్సిటీ అధ్యయనం

03-09-2017: వాతావరణ స్థితిని బట్టి డెంగీ విజృంభించే అవకాశాలను ముందే పసిగట్టే వ్యవస్థను శాస్త్రవేత్తలు రూపొందించారు.భారత్‌లో డెంగీ ముప్పుపై యూకేకు చెందిన లివర్‌పూల్‌ యూనివర్సిటీ పరిశోధక బృందం.. హైదరాబాద్‌లోని భారత కెమికల్‌ టెక్నాలజీ సంస్థ (ఐఐసీటీ), గువహటిలోని జాతీయ ఔషధ విద్య, పరిశోధన సంస్థ (నైపర్‌)లతో కలిసి అధ్యయనం చేసింది. పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, కేరళ ప్రాంతాల్లో వాతావరణానికి, దోమలో డెంగీ వ్యాధి కారక వైరస్‌ వృద్ధికి (ఈఐపీ) మధ్య సంబంధంపై పరిశోధించింది.17, 18 డిగ్రీ సెంటిగ్రేడులోపు ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో ఈఐపీ వ్యవధి చాలా ఎక్కువ. కానీ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఈఐపీ వేగంగా పూర్తయి, దోమలు డెంగీని నాలుగు రెట్లు ఎక్కువగా వ్యాపింపచజేస్తాయని పరిశోధనలో తేలింది.