మహిళలూ నవంబర్ వచ్చేసింది.. జరభద్రం!

శ్వాసకోశ సమస్యల ప్రమాదం
మహిళలకు నిపుణుల సూచనలు
ఆంధ్రజ్యోతి (11-01-2019): నవంబర్‌ వస్తూందంటే చలిగాలులు వస్తున్నట్లే... పగటి పూట ఉష్ణోగ్రతలు మెల్ల మెల్లగా పడిపోతున్నాయి. సాయంత్రం చలిగాలులు కమ్మేస్తున్నాయి. ఉదయం బారెడు పొద్దెక్కితే తప్ప చలిపులి వదలట్లేదు. ఈ నేపథ్యంలో మహిళలు, ముఖ్యంగా వర్కింగ్‌ ఉమెన్‌ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేని పక్షంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. వర్కింగ్‌ ఉమెన్‌ అంటే తప్పనిసరిగాబయటకు వెళ్లి విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
 
 
ముఖసౌందర్యానికి ముప్పు..
చలికాలంలో చర్మ సమస్యలు తలెత్తుతాయి. ముఖం, మెడ, చెవులు వంటి భాగాల్లో చర్మం పొడిగా అవుతుంది. పెదవులు పగలటం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యలను నివారించటానికి కోల్డు లోషన్‌ వాడటం తప్పనిసరి. నాణ్యతలేని లోషన్‌లు వాడితే బయట దుమ్ము ఈ క్రిముల వల్ల చర్మానికి అంటుకొని మరింత చేటు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
 
జ్వరాలతో జరభద్రం...
సీజన్‌ మారే సమయంలో వాతావరణం ఒక్క సారిగా మారుతుంటుంది. ఈ మార్పుని శరీరం ఒక్క సారిగా గుర్తించి సర్దుబాటు చేసుకోవటం కాస్త క ష్టం. వా తావరణం లో ఒక్క సారిగా చ లిగాలు లు విజృంభిస్తాయి. ఈ సమయంలోనే కొన్నిరకాల బ్యాక్టీరియాలు, వైరస్‌లు పెరిగి శరీరంలోకి చేరతాయి. తగినంత రోగనిరోధక శక్తి ఉన్న ట్లయితే ఈ క్రిములు ఏమీ చేయలేవు. లేనిపక్షంలో ఈ క్రిములు వ్యాధులను కలుగచేస్తాయంటున్నారు వైద్యులు. ఈ క్రమంలో సూక్ష్మక్రిములకు వ్యాధి నిరోధక కారకాలకు శరీరం లోపల ఘర్షణ చెలరేగి జ్వరం, పాత నొప్పులు బయట పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
శ్వాసకోశ సమస్యలు
చలికాలం అంటేనే శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి కష్టకాలం. చలిగాలులు తగిలాయంటే లోపల దాగున్న అనారోగ్య సమస్యలు బయటపడతాయి. చలిగాలిలో ఉంటే తేమ ముక్కు ద్వారా శ్వాసకోశాల్లోకి ప్రవేస్తుంది. ఆయా నాళాల్లోని లోపల పొరలు ఈ తేమకు ప్రభావితం అవుతాయి. ఫలితంగా ఊపిరతీసుకోవడం కష్టం అవుతుంది. కొన్నిసార్లు సమస్య వెంటనే ,మరికొ న్నిసార్లు అర్ధరాత్రి దాటాక సమస్య బయట పడవచ్చు. శీతాకాలంలో ఏర్పడే సమస్యలు వచ్చాక బాధపడేకంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యమని నిపుణులు అంటున్నారు. చాలా సమస్యలకు చలిగాలులే కారణం. సాధ్యమైనంతవరకు చలిగాలులు వీచేటప్పుడు బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిది. తప్పనిసరిగా వెళ్లాల్సివస్తే మాత్రం స్కార్పు, స్వెటర్లు ధరించాలి. అరచేతులకు, అరికాళ్లకు సాక్సులు వేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.