ఉపశమనం కోసం..

ఆంధ్రజ్యోతి(12/09/15): ఆడవారు నెలసరి సమయంలో ఏదో ఒక రకమైన నొప్పితో బాధపడుతూనే ఉంటారు. ఆ బాధని భరించలేనివారు ఆ సమయంలో పేయిన్‌ కిల్లర్‌ ట్యాబ్‌లెట్స్‌ని వాడుతుంటారు. అయితే కొన్ని చిట్కాల ద్వారా ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
 కొంచెం దూరం వాకింగ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల కండరాలకు వ్యాయామం అవుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అయితే ఒకసారే ఎక్కువసేపు చేయడం కన్నా మూడు గంటలకొకసారి కొద్దిసేపు వాకింగ్‌ చేస్తుండాలి. అలాగే చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేస్తుంటే నొప్పి నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు. 
ఈ సమయంలో హెవీఫుడ్‌, జంక్‌ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. వీటిని తినడంవల్ల కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రధానంగా ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటుండాలి. నీళ్లు కూడా బాగా తాగుతుండాలి.
 నెలసరి సమయంలో నిమ్మరసం పిండిన గోరు వెచ్చని నీటిని లేదా అల్లంటీ తాగడం ద్వారా కూడా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. 
డార్క్‌ చాక్లెట్‌ తినడం వల్ల కూడా పీరియడ్‌ నొప్పి తగ్గుతుంది. ఇది మంచి అనుభూతిని కలిగించే ఎండార్ఫిన్‌ హార్మోన్‌ అధికంగా విడుదలవడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ సమయంలో డార్క్‌ చాక్లెట్‌ తింటే మంచిది.