మహిళలకు ప్రాణాంతకం ఈ ఎనిమిది!

ఇంట్లోవారందరి ఆరోగ్యం గురించి అహర్నిశలూ తాపత్రయపడుతుంది ‘ఆమె’. ఎవరికి ఏ అనారోగ్య సమస్య ఎదురైనా వారికంటే తనే ఎక్కువగా బాధపడుతుంది. తన శరీరానికి కావల్సిన విశ్రాంతి, ఆహారం, శక్తి వేటిగురించీ ఆమె లెక్కచేయదు. తన కుటుంబ ఆరోగ్యం, సంతోషమే తన సంతోషంగా జీవిస్తుంది. కానీ, చివరకు తనకు తెలియకుండానే ఆమె శరీరం అనారోగ్యంపాలై తనవారికి శాశ్వతంగా దూరమవుతుంది. తాత్కాలిక విశ్రాంతి తీసుకోని ఆమె శరీరం శాశ్వతనిద్రలోకి జారుకుంటుంది. అవును... ఆమె అంత త్వరగా మరణించేందుకు కారణాలు అనేకం. ఇది ఎంతోమంది నిపుణులు కనుగొన్న నిజం.
ప్రపంచవ్యాప్తంగా ఇటీవల జరిపిన కొన్ని పరిశోధనలలో పురుషుల కంటే మహిళలు చాలా త్వరగా మరణిస్తారని నిర్ధారిస్తున్నారు. ఎందుకంటే వీరిలో 8 రకాల వ్యాధులు చాలా త్వరగా మరణానికి కారణం అవుతున్నాయని వెల్లడిస్తున్నారు.

కారణాలు అనేకం!

ప్రపంచంలో రెండు మిలియన్ల కంటే ఎక్కువగా బ్రెస్ట్ మరియు ఓవేరియన్ కేన్సర్‌తో పోరాడుతున్నారు. ఇందులో అతి భయంకరమైన విషయం ఏంటంటే, కొంతకాలం నుంచి మహిళలు ఎక్కువగా డయాబెటిస్‌కు గురి అవుతున్నారు . ఇది ప్రాణాంతకంగా మారుతున్నది. అనీమియా కూడా మరణానికి కారణం అవుతున్నది. ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులతో పోరాడాలన్నా, మరికొంత కాలం జీవించాలన్నా అనేక ట్రీట్‌మెంట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కొన్ని విషయాల్లో, హోం రెమెడీస్ కూడా సహాయపడతాయి. అయితే హోం రెమెడీస్, వ్యాధులను ప్రారంభ దశలో కనుగొన్నప్పుడు ఉపయోగించడం వల్ల కొంతవరకూ నివారించుకోవచ్చు. 
 
హెల్త్ చెకప్‌ తప్పనిసరి!
మహిళలు నెలకొకసారి వైద్యులను సంప్రదించి మెడికల్ టెస్టులు, ఓవరాల్ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం మంచిది. ఇలాంటి మెడికల్ విజిట్స్ వల్ల ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి 25ఏళ్ళు దాటినప్పటి నుంచి మహిళలు వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎంత బిజీగా ఉన్నా ఎంతోకొంత సమయాన్ని తమ ఆరోగ్యం కోసం సమయాన్ని కేటాయించాలి. మరి మహిళల్లో ప్రాణాంతకంగా మారే కొన్ని వ్యాధులేమిటో చూద్దాం. 
 
1.హార్ట్ డిసీజ్: 
మహిళల్లో 38శాతం మంది మొదటి హార్ట్ అటాక్ సమయంలోనే మరణిస్తున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ధూమపానం అలవాటు ఉన్న మహిళల్లో హార్ట్‌లో బ్లాక్స్ ఏర్పడి తద్వారా హార్ట్ అటాక్, గుండె సంబంధిత వ్యాధులకు కారణం అవుతున్నాయి.
 
2.బ్రెస్ట్ కేన్సర్:
మహిళలు 35సంవత్సరాల తర్వాత మామోగ్రామ్ టెస్టును తప్పకుండా చేయించుకోవాలి. దీనివల్ల బ్రెస్ట్ హెల్తీగా ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది. 23ఏళ్ళతర్వాత ప్రతి ఒక్క మహిళ సెల్ఫ్ చెకప్ చేసుకోవడం చాలా అవసరం. ఇలా సెల్ఫ్ చెకప్ వల్ల బ్రెస్ట్‌లో ఏర్పడే అసాధారణ కణుతులు గుర్తించినట్లయితే అది బ్రెస్ట్ కేన్సర్‌కు ప్రారంభ చిహ్నంగా గుర్తించాలి.
 
3. సర్వైకల్ కేన్సర్:
సర్విక్స్‌లోని కణాల్లో కేన్సర్ కణుతులు ఏర్పడతాయి. మహిళలు మల్టిపుల్ సెక్సువల్ సంబంధాల్ని కలిగి ఉండటం సర్వైకల్‌ కేన్సర్ డెవలప్‌మెంట్‌కు కారణం అవుతుంది. దీనికి ఎలాంటి లక్షణాలుండవు. కేన్సర్ పూర్తిగా ఫార్మ్ అయిన తర్వాత లక్షణాలు కనబడతాయి.
 
4.ఓవేరియన్ కేన్సర్: 
ఓవేరియన్ కేన్సర్ ఓవరీస్‌లో వస్తుంది. మహిళల్లో వచ్చే అత్యంత ముఖ్యమైన కేన్సర్ ఇది. ప్రపంచంలో కొన్ని మిలియన్ల సంఖ్యలో ఈ కేన్సర్ బారిన పడుతున్నారు. ఓవేరియన్ కేన్సర్‌కు ప్రారంభ చిహ్నాలేవీ లేవు.
 
5. డిప్రెషన్:
సోషియల్ సిగ్మా వల్ల, చాలామంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకు కారణం డిప్రెషన్‌, వర్క్ ఫీల్డ్‌లో నిస్సహాయస్థితి, ఇంట్లో, బయటా డామినేటెడ్ పరిస్థితులు ఇందుకు కారణం అవుతాయి.
 
6.డయాబెటిస్:
మహిళల్లో 28ఏళ్ల తర్వాత టైప్ 2 డయాబెటిస్ చాలా సాధారణమైపోయింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని బ్యాలెన్స్ చేయలేనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
 
7.కిడ్నీ సమస్యలు:
హై బ్లడ్‌ప్రెజర్, హార్ట్ సమస్యలు ప్రతీ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఉంటున్నాయి. మహిళల్లో కిడ్నీ వ్యాధులు కూడా సాధారణంగా మారాయి. కిడ్నీ వ్యాధి ప్రారంభ లక్షణాలు బ్లీక్, యూరిన్ బ్లడ్ టెస్ట్ వల్ల తెలుసుకోవచ్చు.
 
8. అనీమియా:
అనీమియాకు కారణాలు అనేకం. ప్రతి ముగ్గురిలో ఒకరు ఉండాల్సిన బరువు కంటే తక్కువగా లేదా అధికంగా ఉండటం కూడా అనీమియాకు కారణం అవుతుంది. ఈ హెల్త్ సమస్య గర్భవతుల్లో, అలాగే ఫీటస్‌లో ఇతర సమస్యలకు దారితీస్తుంది.