స్ర్తీల సమస్యలకు కేరళ వైద్యం

ఆంధ్రజ్యోతి(17-01-12): స్త్రీలలో కనిపించే సమస్య పిసిఓడి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే సంతానలేమికి కారణమవుతుంది. స్థూలకాయం, చర్మసమస్యలను తెచ్చిపెడుతుంది. చాలా మందిలో ఈ వ్యాధికి సరియైన చికిత్స లేదనే అపోహ ఉంది.  కానీ కేరళీయ ఆయుర్వేదం ద్వారా పిసిఓడి సమస్యను సమూలంగా తగ్గించుకోవచ్చంటున్నారు డాక్టర్‌ మంజూష. 

స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అండాశయంలో, గర్భాశయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. దీన్ని  పాలిసిస్టిక్‌ ఓవేరియన్‌ డిసీజ్‌(పిసిఓడి)లేదా పాలిసిస్టిక్‌ ఓవేరియన్‌ సిండ్రోమ్‌(పిసిఓఎస్‌) అంటారు. ఆయుర్వేద శాస్త్రాల్లో ఈ సమస్యను ‘గ్రంధి ఆర్తవం’ అని అంటారు. ఈ మధ్యకాలంలో టీనేజ్‌ అమ్మాయిల్లో, 20 నుంచి 30 ఏళ్లలోపు స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. 

 
హార్మోన్లతో సమస్య
స్త్రీలలో ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌ అను ఫిమేల్‌ సెక్స్‌ హార్మోన్స్‌తో పాటు కొంత శాతంలో అండ్రోజెన్‌ అను మేల్‌ హార్మోన్‌ కూడా ఉంటుంది. ఋతుక్రమం సమయంలో అండాశయాలలో అండాలు వృద్ధి చెందడానికి ఈ హార్మోన్లు ఉపకరిస్తాయి. అధిక మానసిక ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, ముఖ్యంగా కఫాన్ని పెంచే ఆహారం, కాలుష్యం, మాంసాహారం , జంక్‌ ఫుడ్‌ను అధికంగా తినడం, వంశపారపర్య కారణాలు వల్ల శరీరంలో కఫం, వాతం వికృతి చెంది ఈ గ్రంధార్తవాన్ని కలిగిస్తుంది. పిసిఓడి సమస్య తలెత్తినపుడు హార్మోన్లు హెచ్చుతగ్గులకు లోనై అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.  ఋతుక్రమం ప్రారంభమయ్యే సమయంలో పిసిఓడికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. 
 
ఋతుక్రమంలో మార్పులు : పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం, వచ్చినపుడు ఎక్కువ రోజులు ఉండటం, పీరియడ్స్‌లో సమయంలో అధిక రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటాయి.
ఒబేసిటి : హార్మోన్ల అసమతౌల్యం వల్ల స్థూలకాయం బారినపడతారు. పిసిఓడితో బాధపడే అమ్మాయిల్లో ఊబకాయం వచ్చి వికారంగా తయారవుతారు. 
పురుష లక్షణాలు: పిసిఓడిలో మేల్‌ హార్మోన్స్‌ ఎక్కువగాఉత్పత్తి చెందడం వల్ల గొంతులో మార్పు, ఛాతీ సైజు తగ్గిపోవడం, ముఖం, ఛాతి, పొట్టపై అవాంఛిత రోమాలు పెరగడం, తల వెంట్రుకలు రాలిపోవడం కనిపిస్తుంది.
చర్మంపై మచ్చలు: శరీరంపై నల్లని మచ్చలు, మొటిమలు ఏర్పడతాయి. చర్మంలో ఉండవలసిన తేమ, మృదుత్వం తగ్గిపోయి ముడతలు పడతాయి. చర్మం సాగేగుణం కోల్పోవడం వల్ల వయసు పైబడిన వారిలా కనిపిస్తారు. 
పిసిఓడితో సమస్యలు
ఊపిసిఓడితో బాధపడే వారిలో అధికబరువు, ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, సంతానలేమి, కొలెస్ట్రాల్‌ పెరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రక్తంలో మలినాలు పెరిగిపోయి చర్మంపై నల్లనిమచ్చలు, మొటిమలు వంటి సమస్యలు మొదలవుతాయి. 
ఊసైకలాజికల్‌ డిజార్డర్స్‌ ప్రారంభమవుతాయి. అధికబరువు, ముఖంపై అవాంఛిత రోమాలు వంటి సమస్యల వల్ల టీనేజ్‌ అమ్మాయిలు తరచూ డిప్రెషన్‌కు లోనవుతూ ఉంటారు. 
ఊపిసిఓడి వల్ల ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. 
 
పరీక్షలు
 పిసిఓడిని గుర్తించడానికి అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ చేయించుకోవాలి. హార్మోన్స్‌ లెవెల్స్‌ తెలుసుకోవడానికి కొన్ని రకాల హార్లోన్ల పరీక్షలు చేయించాలి. ఈస్ట్రోజన్‌ లెవెల్స్‌, ఎఫ్‌ఎస్‌హెచ్‌, ఎల్‌హెచ్‌, టెస్టోస్టిరాన్‌(మేల్‌ హార్మోన్‌) లెవెల్స్‌, 17-కీటోస్టెరాయిడ్స్‌ పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంటుంది. 
 
మూలాలకు చికిత్స
శాస్త్రీయమైన కేరళీయ ఆయుర్వేదం ద్వారా పిసిఓడి సమస్యను శాశ్వతంగా ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ లేకుండా తగ్గించవచ్చు. శరీరంలో వాతం, పిత్తం, కఫం అని త్రిదోషాలు ఉంటాయి. శరీరంలోని అన్ని రకాల పనులకు ఈ త్రిదోషాలే మూలం. పిసిఓడి లేదా గ్రంధి ఆర్తవం ముఖ్యంగా కఫ ప్రధానమైన వ్యాధి. వివిధ రకాల కారణాల వల్ల శరీరంలోని కఫం వికృతి చెంది వాతం, పిత్తాన్ని చెరచి ఈ గ్రంధి ఆర్తవాన్ని కలిగిస్తుంది. దోష స్థితి అనుగుణంగా వివిధ మూలికలు ఆయుర్వేద గ్రంధాల్లో చెప్పారు.  పిసిఓడి లక్షణాలు, చికిత్సకు సంబంధించిన వివరాలు ఆరువేల సంవత్సరాల క్రితమే చరకసంహిత, అష్టాంగ హృదయ వంటి గ్రంధాల్లో వివరించారు. వీటి ఆధారంగా ఈ సమస్యలను సమూలంగా తొలగించే చికిత్సలు ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి వివిధ శాస్త్రీయబద్ధమైన కేరళీయ ఆయుర్వేద మందులు అందుబాటులో ఉన్నాయి. దోషస్థితి, శరీర ప్రకృతి, వ్యాధి తీవ్రత అనుగుణంగా ఈ మందులను కొంతకాలం వాడితే అండాశయంలోని గ్రంధులు కరిగిపోవడమే కాకుండా హార్మోన్ల పనితీరు చక్కబడుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. దీనివల్ల ముఖ వర్చస్సు పెంపొందడమే కాకుండా శరీరంపై నల్ల మచ్చలు, మొటిమలు పూర్తిగా మాయమైపోతాయి. 
 
లేపనాలతో వైద్యం
పిసిఓడితో పాటు అధిక బరువుతో బాధపడేవారికి, సంతానలేమి ఉన్నవారికి, కఫం అధికంగా ఉన్నవారికి ప్రత్యేక తైలాలు, లేపనాలతో చికిత్స చేయడం జరుగుతుంది. ప్రత్యేక చికిత్సల ద్వారా శరీరంలో పేరుకుపోయిన కఫం కరిగిపోయి శ్రోతస్సులు శుద్ధి అవుతాయి. సంతానం కలిగే అవకాశాలు మెరుగవుతాయి. జుట్టురాలడం తగ్గిపోతుంది. వ్యాధి తీవ్రతను బట్టి ప్రత్యేక ఆయుర్వేద మందులను ఇవ్వడం జరుగుతుంది. ఈ చికిత్స ద్వారా నూటికి నూరు పాళ్లు ఖచ్చితమైన ఫలితం లభిస్తుంది.
 
డాక్టర్‌ మంజుషా
మంజుషా ఆయుర్వేదిక్‌ 
హాస్పిటల్‌, మాదాపూర్‌, హైదరాబాద్‌
ఫోన్‌ : 8978 222 777
        8978 222 888