రుతుసమస్యలకు చెక్‌

ఆంధ్రజ్యోతి(16/05/15): స్త్రీలలో నెలసరి సమయంలో నొప్పి రావడాన్ని వైద్యపరిభాషలో డిస్మనోరియా లేక పెయిన్‌ఫుల్‌ మెన్సెస్‌ అంటారు. సుమారు 50 శాతం మంది స్త్రీలు పీరియడ్స్‌ సమయంలో నొప్పితో బాధపడుతుంటారు. యుక్తవయస్సు అంటే 18 నుంచి 24 సంవత్సరాల వరకు ఈ నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. క్రమేణ వయస్సు పెరుగుతున్న కొద్దీ కొంత మంది స్త్రీలలో వివాహానంతరం నొప్పి తీవ్రత తగ్గుతుంది. రుతుచక్రం సాధారణంగా 28 రోజులకు ఒకసారి పునరావృతమవుతుంటుంది. 3 రోజుల నుంచి 7 రోజుల పాటు కనిపిస్తుంది. రుతుక్రమాన్ని, రుతుస్రావాలను మెదడులోని హైపోథాలమస్‌, పిట్యూటరీగ్రంథి, ఆండాశయంలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లు, గర్భసంచిలో ఉత్పత్తి అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్‌ అన్నీ కలిపి ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, హార్మోన్ల వ్యవస్థపై బలమైన ప్రభావం చూపుతుంది. రుతుక్రమం సమయంలో నొప్పి రావడానికి గల ప్రధాన కారణం ప్రొస్టాగ్లాండిన్స్‌ అనే ఒక రసాయనం. ఈ రసాయనం గర్భకోశం లోపలి పొరల్లో ఉత్పత్తి అవుతుంది. 
 
డిస్మనోరియాను రెండు రకాలుగా చెప్పవచ్చు. 
1. ప్రైమరీ డిస్మనోరియా : యుక్తవయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరిలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. దీనికి హార్మోన్‌ అసమతుల్యత ప్రధానమైక కారణంగా ఉంటుంది.
2. సెకండరీ డిస్మనోరియా : వయసు పైబడిన స్త్రీలలో  కనిపిస్తుంది. పొత్తికడుపు ఇన్‌ఫెక్షన్లు, గర్భాశయ కణుతులు ప్రధానమైన కారణం. 
ముఖ్యకారణాలు
హార్మోన్ల అసమతుల్యత, పెల్విక్‌ ఇన్‌ఫెక్షన్లు, గర్భాశయ కణుతులు, గర్భాశయ ముఖద్వారం ఇరుకుగా ఉండటం, ఓవేరియన్‌ సిస్టులు.
వ్యాధి లక్షణాలు
రుతుక్రమ సమయానికి 3 నుంచి 7 రోజుల ముందు నొప్పి మొదలవుతుంది. దీన్ని కంజెస్టివ్‌ డిస్మనోరియా అంటారు. రుతుస్రావం మొదలయిన తరువాత నొప్పి ప్రారంభమై రక్తస్రావం తీవ్రంగా ఉండి ఒకటి రెండు రోజుల వరకు కొనసాగే నొప్పిని స్పాస్‌మోడిస్‌ డిస్మనోరియా అంటారు. పొత్తికడుపులో తీవ్రమైన నొప్పితో పాటు, వెన్నునొప్పికూడా బాధిస్తుంది. విపరీతమైన చిరాకు, కోపం, ఆకలి మందగించడం, నీరసం వంటి లక్షణాలుంటాయి. 
వ్యాధి నిర్ధారణ పరీక్షలు
రక్తపరీక్ష ద్వారా హార్మోన్ల శాతాన్ని గుర్తించడం, అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ పెల్విస్‌ పరీక్షలు ఉపకరిస్తాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు
హార్మోన్ల సమతుల్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు తినాలి. స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి. మానసిక ప్రశాంతత అలవర్చుకోవాలి. 
హోమియో వైద్యం
డిస్మనోరియాకు హోమియోలో చక్కని చికత్స ఉంది. శారీరక, మానసిక స్థితిని, వ్యాధి లక్షణాలను పరిగణలోకి తీసుకుని కాన్‌స్టిట్యూషనల్‌ పద్ధతి ద్వారా మందులు ఎంపిక చేసి ఇవ్వడం వల్ల ఫలితం ఉంటుంది. బెల్లడోనా, కామోమిల్లా, మెగ్‌ఫాస్‌, అబ్రోమా వంటి మందులు బాగా పనిచేస్తాయి. వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే డిస్మనోరియా సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. 
 
 
డాక్టర్‌ కిరణ్‌కుమార్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌
పాజిటివ్‌ హోమియోపతి, ఫోన్‌ : 92461 99922
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు
డాక్టర్‌తో మాట్లాడాలంటే ఫోన్‌ : 92461 84828