రుతుక్రమ సమస్యలకు చెక్‌

ఆంధ్రజ్యోతి(16-10-13): చాలా మంది స్త్రీలు రుతు సంబంధ సమస్యలతో అవస్థలు పడుతుంటారు. కొందరిలో ఈ సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. సాధారణంగా స్త్రీలపై కుటుంబపరమైన, వృత్తిపరమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావం వల్ల రుతుక్రమంలో తేడాలు చోటుచేసుకుంటాయి. ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగినప్పుడు హార్మోన్లపై దాని ప్రభావం పడుతుంది. ఇది ఎర్లీ మెనోపాజ్‌కు దారితీస్తుంది. స్త్రీలలో క నిపించే సాధారణ సమస్యల్లో పీసీఓడి, ఫైబ్రాయిడ్స్‌, మెన్‌స్ట్రువల్‌ డిజార్డర్స్‌, మెనోపాజ్‌ ముఖ్యమైనవి. 
పీసీఓడి
ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ (పీసీఓడి). ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న అమ్మాయిల్లో ఎక్కువగా కనిపిస్తోంది. 15 నుంచి 25 ఏళ్ల వయసున్న వారిలో కూడా కనిపిస్తోంది. పీసీఓడికి ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యత. స్త్రీలలో పురుష హార్మోన్లు(టెస్టోస్టెరాన్‌) పెరగడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. దీర్ఘకాలంగా ఒత్తిడి ఉండటం వంటివి కూడా కారణమవుతాయి. 
లక్షణాలు 
పీసీఓడి సమస్య మొదలైన వెంటనే దాని ప్రభావం కనిపిస్తుంది. పీరియడ్స్‌ సరిగ్గా రాకపోవడం, వచ్చినా బ్లీడింగ్‌ ఎక్కువ కావడం, కడుపునొప్పి, అవాంఛిత రోమాలు, మెడ దగ్గర నల్లబడటం, జుట్టు రాలడం, ముఖంపై మొటిమలు రావడం జరుగుతుంది. వీరిలో కనిపించే మరో ముఖ్యమైన లక్షణం అధికంగా బరువు పెరగడం. సంతానలేమి సమస్య కూడా కనిపిస్తుంది.
ఫైబ్రాయిడ్స్‌
మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య ఫైబ్రాయిడ్స్‌(గర్భాశయంలో కణుతులు). గర్భాశయం లోపలి కండరం అధికంగా పెరిగి గడ్డలుగా మారడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఇవి కేన్సర్‌కు సంబంధించినవి కావు. కేన్సర్‌గా మారే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే ఈ ఫైబ్రాయిడ్స్‌ ఏ వయసులోనైనా రావచ్చు. అంటే రుతుక్రమం మొదలైన దగ్గర నుంచి మెనోపాజ్‌ వరకు ఏ దశలోనైనా రావచ్చు. ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడటానికి ప్రత్యేక కారణమంటూ లేదు. చాలా మందిలో ఫైబ్రాయిడ్స్‌ ఉన్నా ఎటువంటి లక్ష ణాలూ కనిపించవు. సాధారణంగా ఫైబ్రాయిడ్స్‌ సైజు, ఉన్న ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. ఫైబ్రాయిడ్స్‌ గర్భసంచి బయట ఉంటే వాటిని సబ్‌ సెరొసల్‌ ఫైబ్రాయిడ్స్‌ అంటారు. వీటివల్ల పెద్దగా సమస్య ఏర్పడదు. సబ్‌మ్యూకోసల్‌, ఇంట్రా మ్యూరల్‌ ఫైబ్రాయిడ్స్‌ గర్భసంచి లోపల ఏర్పడతాయి. వీటివల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. 
లక్షణాలు
ఫైబ్రాయిడ్‌ మూలంగా గర్భస్రావం అయ్యే అవకాశాలుంటాయి. పీరియడ్స్‌ సరిగ్గా రావు. రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. కడుపు నొప్పి ఉంటుంది. సంతానలేమి సమస్య ఎదురవుతుంది. 
మెన్‌స్ట్రువల్‌ డిజార్డర్స్‌
సాధారణంగా కనిపించే సమస్యల్లో ముఖ్యమైనవి డిస్మెనోరియా, మెనోరేజియా, మెట్రోరేజియా, అమెనోరియా.
డిస్మెనోరియా 
పీరియడ్స్‌ సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. యుక్త వయసులో ఉన్న అమ్మాయిల్లో సాధారణంగా కనిపిస్తుంది. డిస్మెనోరియా మూడు రకాలుగా ఉంటుంది.
కంజెస్టివ్‌ డిస్మెనోరియా : కొంతమందిలో బహిష్టుకు మూడు నుంచి ఐదు రోజుల ముందే పొత్తి కడుపులో, నడుము భాగంలో నొప్పితో ప్రారంభమవుతుంది. ఇది రుతుస్రావం మొదలైన తరువాత ఔషధాలు ఉపయోగించకపోయినా దానికదే తగ్గిపోతుంది. దీనిని కంజెస్టివ్‌ డి స్మెనోరియా అంటారు. ఎండోమెట్రియాసిస్‌, మయోమస్‌, ఎడినోమోసిస్‌ కారణం అవుతుంది.
స్పాస్‌మోడిక్‌ డిస్మెనోరియా : బహిష్టు మొదలైన మొదటి రోజు మాత్రమే ఒకటి, రెండు గంటలు నొప్పి ఉండి రుతుస్రావం సాఫీగా జరగడంతో తగ్గిపోతుంది. ఈ సమయంలో వచ్చే నొప్పి ఎక్కువగా ఉండి పొట్ట బిగదీసినట్లుగా ఉండటం, విరేచనాలు కావడం వంటి లక్షణాలు ఉంటాయి. నొప్పి మరీ అధికంగా ఉన్నప్పుడు  వాంతులు కావడం జరుగుతుంది. దీనిని స్పాస్‌మోడిక్‌ డిస్మనోరియా అంటారు. ఇంట్రా యుటెరైన్‌ కాంట్రాసెప్టిక్‌ డివైజెస్‌, సైకోజెనిక్‌ ఫ్యాక్టర్స్‌, ఒత్తిడి వంటివి కారణమవుతాయి.
మెంబ్రేనస్‌ డిస్మెనోరియా : నొప్పి విపరీతంగా ఉంటుంది. 
మెనోరేజియా : పీరియడ్స్‌ క్రమం తప్పకుండా వస్తుంటాయి. కానీ రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. ఎండొక్రైన్‌ డిజార్డర్స్‌, కాంట్రాసెప్టివ్స్‌ ఎక్కువగా కాలం వాడటం, హైపోథైరాయిడిజమ్‌, ఫైబ్రాయిడ్స్‌, పీసీఓడి, ఎండోమెట్రియాసిస్‌ కారణమవుతాయి.
పాలీమెనోరియా : రెండు లేదా మూడు వారాలకొకసారి పీరియడ్స్‌ వస్తుంటాయి. అధిక రక్తస్రావం లేక ఎక్కువ రోజులు రక్తస్రావం కావడం జరుగుతుంది. 
మెట్రోరేజియా : క్రమం తప్పి రక్తస్రావం జరుగుతుంది. 
మెనోపాజ్‌
45 నుంచి 55 ఏళ్ల మధ్య వయసుల్లో మెనోపాజ్‌ దశ కనిపిస్తుంది. 50 ఏళ్ల వరకు పీరియడ్స్‌ కొనసాగడం వల్ల స్త్రీల ఆరోగ్యం బాగుంటుంది. 40 ఏళ్ల కన్నా ముందే మెనోపాజ్‌ వచ్చినట్లయితే ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌ అని అంటారు.
లక్షణాలు
మానసికంగా ఆందోళనకు గురవుతారు. నిద్రలేమి కనిపిస్తుంది. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ లోపం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. తలనొప్పి కనిపిస్తుంది. పీరియడ్స్‌ ఆగిపోతాయి. ఆస్టియోఆర్థరైటిస్‌, నడుమునొప్పి వంటివి మొదలవుతాయి. మూత్రంలో మంట ఉంటుంది. చర్మం పొడిబారిపోతుంది. కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల స్థూలకాయం వస్తుంది. 
 
నిర్ధారణ 
అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌, హార్మోన్‌ పరీక్షలు వ్యాధి నిర్ధారణలో ఉపయోగపడతాయి.
 
హోమియో చికిత్స
ఎటువంటి శస్త్రచికిత్సా లేకుండానే పీరియడ్స్‌ సంబంధ సమస్యలకు హోమియోలో పరిష్కారం లభిస్తుంది. ఎటువంటి దుష్ప్రభావాలూ లేకుండానే వ్యాధిని తగ్గించవచ్చు. అయితే పూర్తికాలం చికిత్స తీసుకోవడం తప్పనిసరి. దాంతోపాటు ఆహార నియమాలు కూడా పాటించాలి. శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స చేస్తే పీరియడ్స్‌ సమస్యలు ఇట్టే దూరమవుతాయి. పల్సటిల్లా, సెపియా, నేట్రం మ్యూరియాటికం, ఇగ్నీషియా వంటి మందులు చికిత్సలో బాగా ఉపయోగపడతాయి.
 
డాక్టర్‌ అనుభా జైన్‌
జెనెటిక్‌ హోమియోపతి
కొండాపూర్‌ - దిల్‌సుఖ్‌నగర్‌
హైదరాబాద్‌
ఫోన్‌: 8125 108 108
        8019 108 108