రక్తస్రావాన్ని అరికట్టే కృత్రిమ ప్లేట్‌లెట్స్‌

ఆంధ్రజ్యోతి(02/12/14): రక్తస్రావాన్ని తొందరగా అరికట్టి వైద్య చికిత్సకు తోడ్పడే కృత్రిమ ప్లేట్‌లెట్‌లను కాలిఫోర్నియా, శాంటా బార్బరా యూనివర్సిటీ పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. రక్తంలోని ప్లేట్‌లెట్‌ల పనితీరును యథా   తథంగా అనుకరించేలా వీటిని రూపొందించామని, ఈ ఆవిష్కరణతో అత్యవసర సందర్భాలలో, విపరీతమైన రక్తస్రావం కారణంగా ప్రాణాపాయానికి చేరువయ్యే పరిస్థితి నుంచి రోగిని బయటపడేయవచ్చని అన్నారు. ఈ బృందంలో భారత సంతతికి చెందిన ఇరువురు శాస్త్రవేత్తలు కూడా ఉండడం విశేషం. కాగా, ఈ కృత్రిమ ప్లేట్‌లెట్లతో మందులను శరీరంలో అవసరమైన చోటికి నేరుగా చేర్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన పరిశోధక విద్యార్థి ఆరోన్‌ అన్‌సెల్మో వివరించారు.