మైక్రోచిప్‌పై కృత్రిమ అండాశయం!

ఆంధ్రజ్యోతి(30-6-15): గర్భధారణలో అండాశయం పాత్రపై మరిన్ని పరిశోధనలు నిర్వహించేందుకు అమెరికన్‌ శాస్త్రవేత్తలు మైక్రోచిప్‌పై అండాశయాన్ని కృత్రిమంగా సృష్టించారు. వైనే స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ బృందంలో భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త కూడా ఉన్నారు. తల్లి అండాశయం నుంచి పిండానికి పోషకాలు అందే తీరు, తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు దీనికి రూపకల్పన చేసినట్లు వైనే స్టేట్‌ వర్సిటీకి చెదింన రాబర్టో రొమిరో తెలిపారు.