త్వరలో డయేరియాకు టీకా!

లండన్‌: చిన్న పిల్లల్లో మరణాలకు కారణమయ్యే డయేరియా వ్యాధికి ప్రభావవంతమైన టీకాను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మేరకు లాన్సెట్‌ జర్నల్‌లో అధ్యయనం ప్రచురితమైంది. క్రియారహితమైన ఈ-కొలి బ్యాక్టీరియా ద్వారా ఈ టీకాను అభివృద్ధి చేశారు. దీనిని పోలియో చుక్కల మాదిరిగానే నోటి ద్వారా అందించవచ్చు. దీనికి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా పూర్తయ్యాయి. 6 నెలల నుంచి 5 సంవత్సరాల వయస్సున్న 450 మంది పిల్లలకు ఈ టీకా ఇచ్చారు. ఇది సమర్థంగా పనిచేసింది. ఆ పిల్లల్లో డయేరియాను ఎదుర్కొనే శక్తి పెరిగింది.