ఆంధ్రజ్యోతి: ఆకుకూరల్లో విరివిగా లభించే విటమిన్-ఎ కళ్లకు మంచిది.. రేచీకటిని దూరం చేస్తుంది! ఇది చాలా మందికి తెలిసిన విషయమే! కానీ, తెలియని ఇంకో విషయమేంటంటే.. అదే విటమిన్-ఎ.. చిన్నారులకు మలేరియా రాకుండా నివారిస్తుంది!! ఇది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట! ముఖ్యంగా వర్షాకాలంలో దీనిని ఇస్తే దాని ప్రభావం చాలా వరకు పనిచేస్తుందని వివరిస్తున్నారు. జాన్ హాప్కిన్స్ బ్లూమ్బర్గ్ స్కూల్ పరిశోధకులు 6,100 మంది ఆరు నెలల నుంచి ఐదేళ్ల లోపు పిల్లలపై పరిశోధనలు చేశారు. వారికి ముందుగానే విటమిన్-ఎను ఒకేసారి పెద్దమోతాదులో ఇస్తే దానిని సమర్థంగాఎదుర్కోవచ్చని పేర్కొంటున్నారు.