తెల్లమచ్చలు పిల్లల్లోనూ ఎక్కువే

ఆంధ్రజ్యోతి(05-11-13): తెల్ల మచ్చలతో బాధ పడే పిల్లల మనసుల్ని పట్టించుకోకుండా, ఇతరత్రా ఎంత ప్రేమ కురిపిస్తే మాత్రం ఏమిటి? తెల్ల మచ్చలు సమస్య కేవలం పెద్దవాళ్లలోనే ఉంటుందని చాలా మంది అనుకుంటారు. అందుకే చాలా మంది త ల్లిదండ్రులు ఆ సమస్యను పట్టించుకోరు. నిజానికి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా  పసిపిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువగానే కనపిస్తోంది. గమనిస్తే  5నుంచి 15 ఏళ్ల పిల్లల ముఖం మీద  ఈ తెల్ల మచ్చలు ఎక్కువగా  కనిపిస్తున్నాయి. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అది వారికి తీరని వేదన మిగిలిస్తుంది.  అలా కాకుండా  ముందే శ్రద్దవహించి ఆయుర్వేద వైద్య చికిత్సలు ఇప్పిస్తే సమస్య అంతటితోనే ముగిసిపోతుంది అంటోంది ఆర్‌. కె ఆయుర్వేద వైద్య బృందం.
తెల్ల మచ్చల వ్యాధి రావడానికి చర్మానికి సంబంధించిన మెలినోసైట్స్‌ తగ్గడమూ మూలం. అందుకు కారణాలు అనేకం. వాటిలో శరీరానికి అవసరమైన స్థాయిలో పోషకాలు విటమిన్లు అందక పోవడం ఒక కారణమైతే, వ్యాధి నిరోధక శక్తి లోపాలు మరో కారణం. ప్రత్యేకించి  పసి పిల్లల్లో ఈ వ్యాధి రావడానికి మరికొన్ని ఇతర కారణాలు కూడా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా శిశువు గర్భంలో ఉన్నప్పుడు తల్లికి సరియైన పోషకాహారం అందకపోవ డం కూడా అందుకు కారణం కావచ్చు. లేదా పుట్టిన తరువాత శిశువుకు పోషకాహారం అందకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. అలాగే వయసు మీరిన తరువాత పిల్లల్ని కనడం కూడా ఒక ప్రధాన కాణమే. దీనికి తోడు, తల్లి దండ్రుల్లో ఎవరికైనా ఈ తెల్ల మచ్చల వ్యాధి ఉన్నప్పుడు వారి పిల్లలకు వచ్చే అవకాశాలు దాదాపు 20 శాతం దాకా ఉంటాయి. మేనరికం పెళ్లిచేసుకున్న దంపతుల పిల్లల్లో కూడా ఈ వ్యాధి ఎక్కువగానే కనిపిస్తుంది. కొన్ని రకాల మందుల్ని ఏళ్ల పర్యంతం వాడటం వల్ల వాటి తాలూకు కల్మషాలు, రసాయనాలు శరీరంలో పేరుకుపోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం,ఆ శక్తి లోపాల వల్ల తెల్ల మచ్చలు రావడం కూడా జరగవచ్చు. కొంత మంది స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు పోషకాల కోసం ప్రకృతి సహజమైన పౌష్టికాహారం తీసుకోకుండా, విటమిన్లు ట్యాబ్లెట్ల మీదే ఎక్కువగా ఆధారపడటం కూడా ఒక కారణమే. ఇవి శక్తిని ఇవ్వకపోగా, తల్లికీ పుట్టబోయే బిడ్డకూ హాని చేస్తాయి. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి విపరీతమైన మానసిక ఒత్తిడికి గురికావడం కూడా ఈ తరహా వ్యాధులు రావడానికి పరోక్ష కారణం కావచ్చు. 
జన్యుపరమైన కారణాలు
శిశువు శరీర ధర్మం అనేది గర్భజ ప్రకృతి, జాతజ ప్రకృతి అనే ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు సంక్రమించే లక్షణాలు గర్భజ ప్రకృతికి సంబంధించినవి. శిశువు పుట్టిన తరువాత తీసుకునే ఆహారం, పెరిగిన వాతావరణం ఆధారంగా సంక్రమించే ప్రభావాలు జాతజ ప్రకృతికి సంబంధించినవి. గర్భం దాల్చే సమయంలో కన్నవారి నుంచి కలిగే ప్రభావాల గురించి ఆయుర్వేద శాస్త్రం మాతృజ భావాలు, పితృజ భావాలు, ఆత్మజ భావాలు, సాత్మజ భావాలు, రసజ భావాలు, సత్వజ భావాలు అంటూ ఆరు భావాలు చెప్పింంది. మాతృజ, పితృజ భావాలు ఇవి తల్లిదండ్రుల నుంచి సంక్రమించేవి ఇవి ప్రత్యక్షంగా రక్తసంబంధమైనవి. శరీరంలోని కొన్ని పరిణామాలు శరీరానికి అవసరమైనవేమీ కాకపోయినా ఒక అలవాటుగా కొన్ని పెద్దలనుంచి సంక్రమిస్తూ ఉంటాయి. వాటిని సాత్మజ భావాలు అంటారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అందే పోషకాల ఆధారంగా ఏర్పడే స్థితి వీటినే రసజ భావాలు అంటారు. కన్న వారి వ్యక్తిత్వం ఆధారంగా వచ్చే భావాలను సత్వజ భావాలు అంటారు. వీటితో పాటు తీసుకునే ఆహారం వాత, పిత్త, కఫాల్లో దేన్ని ప్రకోపితం చేస్తోంది అనే దాని మీద కూడా వారి శరీర ధర్మం, వారి వ్యాధి నిరోధక శక్తి ఏర్పడుతుంది. ఆ శరీరం ఏ వ్యాధుల్ని అధిగమిస్తుందనే విషయం గానీ, ఏ వ్యాధులకు గురవుతుందనే విషయం గానీ, ఆధారంపడి ఉంటుంది. 
ఇతర వ్యాధులు కలగలసి...
తెల్ల మచ్చల వ్యాధి ఉన్న వారిలో థైరాయిడ్‌ సమస్యలు, మధుమేహం కూడా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. తెల్ల మచ్చల వ్యాధి వల్లే ఇవి వచ్చాయని కాదు కానీ, ఏ కార ణాలు తె ల్ల మచ్చలు రావడానికి కారణమవుతున్నాయో, ఆ కారణాలే థైరాయిడ్‌, మధుమేహం రావడానికి కారణంగా అనుకోవచ్చు. తెల్ల మచ్చల వ్యాదిగ్రస్తుల్లో దాదాపు 26 శాతం మంది మధుమేహానికి గురికావడం కూడా కనిపిస్తుంది. వీటికితోడు ల్యూకోడెర్మా వ్యాధి గ్రస్తుల్లో పలురకాలు చర్మ వ్యాధులు ప్రత్యేకించి సొరియాసిస్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. తెల్ల మచ్చల వ్యాధి చర్మం ఉపరి భాగంలో కనిపిస్తున్నప్పటికీ ఇతర కీలక అవయవాలు వ్యాఽధిగ్రస్తం కావడానికి పరోక్ష కారణంగా కనిపిస్తోంది. ఇవే కాకుండా కీళ్లు వాచిపోయే రూమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, అజీర్తి సమస్యలతో వచ్చే డిస్పెప్సియా గానీ, వచ్చే అవకాశం ఉంది. 
ఆయుర్వేద విశిష్టత
మొత్తంగా చూస్తే శరీరంలో వ్యర్థ, విషపదార్థాలు పేరుకుపోవడం, వ్యాధనిరోధక శక్తి తగ్గిపోవడం ఇవే ప్రధాన కారణంగా కనిపిస్తాయి. సహజమైన చర్మ వర్ణానికి అసవరమైన మెలినోసైట్స్‌ తగ్గడానికి ఇవే ప్రధాన కారణంగా కనిపిస్తాయి. అందుకే శరీరంలోని కల్మషాలను తొలగించడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. అందుకు ఆయుర్వేదం పంచకర్మ చికిత్సలు చేస్తుంది. ఆ తరువాత శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి శమన, శోధన చికిత్సలతో పాటు రసాయన చికిత్సలు కూడా చేస్తుంది. అయితే పిల్లల వయసును బట్టి పంచకర్మ చికిత్సల్లో ఏవి అవసరం, ఏవి అవసరం లేదు అనేది అనుభవజ్ఞుడైన ఆయుర్వేద డాక్టర్‌ నిర్ణయిస్తారు. తెల్ల మచ్చలు రావడానికి కారణమైన మెలినోసైట్స్‌ లోపాలను తొలగించడానికి అవసరమైన ఇతర వైద్య చికిత్సలు కూడా ఉంటాయి. అందుకే మరే ఇతర వైద్య విధానాల్లోనూ తగ్గని తెల్ల మచ్చలు ఆయుర్వేద వైద్య చికిత్సలో తగ్గుతున్నాయి. ఇది కచ్ఛితమైన వాస్తవం.
 
 
ఆర్‌. కె ఆయుర్వేద వైద్య బృందం
ఆర్‌ కె ఆయురే ్వదిక్‌ అండ్‌ సొరియాసిస్‌ సెంటర్‌
క్లినిక్స్‌: హైదరాబాద్‌,విజయవాడ, వైజాగ్‌, హన్మకొండ, 
కర్నూలు, తిరుపతి 
ఫోన్స్‌: 98492 54587, 040-23057483