శస్త్రచికిత్స లేకుండా టాన్సిలైటిస్‌కు చికిత్స

ఆంధ్రజ్యోతి(15-10-14): పిల్లల్లో తరచుగా వచ్చే టాన్సిల్స్‌ వ్యాధి గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. టాన్సిల్స్‌కు సరైన వైద్య సలహాలు పాటించి, ప్రాథమిక దశలోనే చికిత్స చేయిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హోమియో మందుల వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు లేకుండా, శస్త్రచికిత్స అవసరం లేకుండా టాన్సిలైటిస్‌ను సమూలంగా నయం చేయవచ్చంటారు హోమియో వైద్యనిపుణులు డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లావర్‌.
టాన్సిల్స్‌ సమస్య వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ వచ్చే అవకాశం ఉంది. 6 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు ఉండే పిల్లల్లో ఈ వ్యాధి సర్వసాధారణంగా, మూడు సంవత్సరాల లోపు ఉండే చిన్న పిల్లల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. గొంతులో నాలుక వెనుక భాగంలో ఇరువైపులా బాదం ఆకారంలో ఉండే లింఫ్‌ గ్రంధులు లేదా శోషరస గ్రంధులను టాన్సిల్స్‌ అంటారు. ఇది లింఫాటిక్‌ కణజాలంతో ఏర్పడుతుంది. ఆరోగ్యవంతంగా ఉండే టాన్సిల్స్‌ దేహ రక్షణకు తోడ్పడతాయి. గాలి, నీరు, ఆహారంలో ఉండే సూక్ష్మజీవులు నోటి ద్వారా లోపలకు వెళ్లకుండా పోరాడి గొంతుకు రక్షణ కలిగిస్తాయి. టాన్సిల్స్‌ వాపు లేదా ఇన్‌ఫ్లమేషన్‌కు గురవడాన్ని టాన్సిలైటిస్‌ అంటారు.అపరిశుభ్ర పరిసరాలు, కలుషిత నీరు, ఆహారం, శీతలపానీయాలు, ఐస్‌క్రీమ్‌లు, గాలి, వెలుతురు రాని ఇల్లు, గుంపు ప్రదేశాలు, స్కూళ్లు, థియేటర్లు ఇన్ఫెక్షన్‌లు రావటానికి తోడ్పడతాయి.
కారణాలు
సాధారణంగా టాన్సిల్స్‌ వాపు ఉన్నవారు 85 శాతం మందికి వైరల్‌ ఇన్ఫెక్షన్‌ల ద్వారా మిగిలిన 15 శాతం మందికి బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌లు, ముఖ్యంగా స్ట్రెప్టోకోకల్‌ జాతికి చెందిన బ్యాక్టీరియా వల్ల వచ్చే అవకాశం ఉంది. గొంతు ఇన్ఫెక్షన్‌లు, జలుబు, ఫ్లూ వ్యాధులను ప్రభావితం చేసే సూక్ష్మజీవులు కూడా టాన్సిల్స్‌ను ఇన్ఫెక్ట్‌ చేసే అవకాశం ఉంది. నిల్వ చేసిన ఆహార పదార్థాలు, శీతల పానీయాలు తీసుకోవడం, వాతావరణంలో మార్పులు, కుటుంబ చరిత్ర మొదలైనవి టాన్సిల్స్‌ వ్యాధికి ప్రధాన కారణాలు. ఒకరితో ఒకరు మాట్లాడేటపుడు గాలిద్వారా, మాటల ద్వారా తుంపర్లు బ్యాక్టీరియా, వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకడం ద్వారా టాన్సిల్స్‌ సంక్రమిస్తుంటాయి. 
కారణాలు
గొంతునొప్పి, మింగడానికి కష్టంగా ఉండటం, గొంతు గరగర మనటం, దుర్వాసన, జ్వరం, చెవిలో నొప్పి, దవడ నొప్పి, మెడ బిగుసుకు పోవడం, తలనొప్పి వంటి లక్షణాలు గమనించవచ్చు. ఇవి కాకుండా కొందరిలో నీరసం, ఆకలి తగ్గడం, ఒళ్లునొప్పులు వంటివి చూడవచ్చు. ఈ టాన్సిలైటిస్‌ వ్యాధి పరిణామం ముదిరితే దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. మరికొందరిలో ఈ వ్యాధి ప్రమాదకరం కావచ్చు. అందులో ప్రధానమైనది పెరి టాన్సిలార్‌ ఆబ్సెస్‌. ఇది టాన్సిల్స్‌ పొరలో చీము గడ్డ ఏర్పడటం వల్ల వస్తుంది. తీవ్రమైన జ్వరం, ఉమ్ము కూడా మింగలేక పోవటం, ముద్దగా మాట్లాడటం, తీవ్రమైన చెవిపోటు వంటి లక్షణాలు ఉంటాయి. అశ్రద్ధ చేస్తే ఈ చీము రక్తనాళాల ద్వారా దేహంలోని ఇతర ప్రాంతాలకు పాకి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. 
నిర్ధారణ పరీక్షలు
వైద్యుడు నోటిని, గొంతును పరీక్షించడం జరుగుతుంది. టాన్సిల్స్‌ వాపునకు గురవటం, ఎరుపు రంగులో కమిలిపోవడం, ఈ గ్రంధులపైన చిన్న చిన్న తెలుపు మచ్చలు ఏర్పడటం చూస్తుంటాం. గొంతు దగ్గర దవడ కింద బిళ్లలు వాపు, నొప్పి కలిగి ఉంటాయి. రాపిడ్‌ స్ర్టెప్‌ టెస్ట్‌, స్ట్రెప్ట్‌ కల్చర్‌ వంటి పరీక్షల ద్వారా కూడా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
హోమియో చికిత్స
టాన్సిలైటిస్‌ వ్యాధి శరీరంలోని రోగనిరోధక శక్తి కరవై సూక్ష్మజీవులు సంపర్కానికి తేలికగా లోనవడం వల్ల వస్తుంది. హోమియోలోని జెనిటిక్‌ కాన్స్‌టిట్యూషనల్‌ వైద్యం ద్వారా రోగి శరీరతత్వాన్ని బట్టి వ్యాధి లక్షణాలు, కారణాలు, వాతావరణంలో మార్పులు వంటివి గుర్తించి రోగిని వ్యక్తీకరించడం జరుగుతుంది. ఈ విధంగా చికిత్స చేయడం ద్వారా వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. రోగనిరోధకశక్తిని పెంపొందించడం జరుగుతుంది. హోమియో మందుల వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు లేకుండా, శస్త్రచికిత్స అవసరం లేకుండా వ్యాధిని సమూలంగా నయం చేయవచ్చు.
 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మొర్లవార్‌ (సీఎండీ)

హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ ప్ర్తె.లి.

 ఫోన్‌ : 9550001199/88

టోల్‌ ఫ్రీ : 1800 102 2202

[email protected]