సైనస్‌ సమస్యలకు ముగింపు

 ఆంధ్రజ్యోతి(20-12-14): చిన్నపిల్లల్లో టాన్సిల్సు, అడినాయిడ్స్‌, నాసల్‌ పాలిప్స్‌, సైనసైటిస్‌ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ వ్యాధులకు ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా కాన్సిస్ట్యూషనల్‌ హోమియో  చికిత్స ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చంటున్నారు హోమియో వైద్యనిపుణులు  డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి.

టాన్సిల్స్‌: గొంతు ముందు భాగంలో ఇరువైపులా గోలీల్లాగా ఉంటాయి. టాన్సిల్స్‌ వల్ల పిల్లల్లో తరచూ జలుబు, జ్వరం, గొంతునొప్పి, ముక్కుదిబ్బడ, గురక సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యకు ప్రతిసారి యాంటిబయాటిక్స్‌ వాడితే తగ్గి మళ్లీ వస్తుంటాయి. ఇన్ఫెక్షన్‌ వల్ల వాపుతోపాటు చీము పడుతుంది. టాన్సిల్స్‌కు ఆపరేషన్‌ లేకుండా హోమియో చికిత్స ద్వారా నయం చేయవచ్చు.

బెల్లడొనా: టాన్సిల్స్‌ ఎర్రగా వాచిపోయి గొంతు నొప్పితోపాటు మింగటంలో కష్టం అవుతుంది. నమల రాదు. చల్లగాలికి బాధ పెరగటంతోపాటు తరచూ జ్వరం వస్తుంది. 

మెర్క్‌ఐడ్‌ రూబ్రమ్‌ : టాన్సిల్స్‌, కంఠ భాగం ఎర్రగా ఉంటుంది. మింగటంలో ఇబ్బంది, గొంతులో కఫం అడ్డుకుంటుంది. మెడ కండరాలు పట్టినట్లుంటాయి. దగ్గు, బొంగురుగొంతు సమస్యలకు సరైన మందు. 

అడినాయిడ్స్‌ : వీటినే నాసాఫారింజియల్‌ టాన్సిల్స్‌ అంటారు. ముక్కు వెనుకభాగం, గొంతులో కలిసే భాగంలో స్పాంజిలాంటి చిన్న కణజాలం ఉంటుంది. వైరస్‌, బాక్టీరియా క్రిములను శుద్ధిచేసే ఫిల్టరు లాంటిది. దీనివల్ల శ్వాసలో ఇబ్బంది ఏర్పడుతుంది. నోటి ద్వారా శ్వాస తీసుకోవటం, గురక, నిద్రలో ఉలికిపడి లేవటం, శ్వాస ఆడకపోవటం సమస్యలుంటాయి. దీనివల్ల వినికిడి లోపం, చెవిలో చీము, గొంతునొప్పి రావచ్చు. దీనికి హోమియో చికిత్స మేలు.
కానల్కేరియాఫాస్‌: కాల్కేరియా అయిడ్‌, ఐమోడియమ్‌, మెర్క్‌సాల్‌, ట్యుబర్కిలినమ్‌ వంటి మందులు వాడవచ్చు. ఈ మందు వాడటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆడినాయిడ్‌ వాపు తగ్గుతుంది. శ్వాస ఇబ్బందులు, నిద్రలేమి, చెవిబాధలు తగ్గుతాయి. 
సైనసైటిస్‌ : ముఖభాగంలో ఉండే సన్నని ఖాళీ ప్రదేశాన్నే సైనస్‌ అంటారు. నాసల్‌, ప్యారా నాసల్‌, మాగ్జిలరీ, ఎథ్‌మాయిడల్‌, స్ఫీనాయిడల్‌ రకాలు. ముక్కు ద్వారా వచ్చే కాలుష్యం, ఇన్ఫెక్షన్‌లతో ఈ సమస్య వస్తుంది. ముక్కు ద్వారా తలనొప్పి, తలభారం, తుమ్ములు, జలుబు, ముక్కు కారటం, ముక్కుదిబ్బట, ముక్కు నుంచి నోటిలోకి ద్రవం రావటం, వళ్లు నొప్పులు, దగ్గు, చదువులో శ్రద్ధ లేకపోవటం, చెవినొప్పి, జ్ఞాపకశక్తి తగ్గటం, నిద్రలేమి సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈ సమస్యను హోమియో మందులతో దూరం చేయవచ్చు. 

బ్రయోనియా : కోపం, చిరాకు, భరించరాని తలనొప్పి, ముక్కులో రక్తం కారటం, శ్వాస ఆడకపోవటం, జలుబు, తలనొప్పి సమస్యలకు మేలైన ఔషధం. కాలిబైక్‌ : కనుబొమ్మల వద్ద నొప్పి, చూపులో ఇబ్బందులు, ముఖభాగంలో నొప్పి, ఎముక భాగంలో నొప్పి, ముక్కు దిబ్బడ,  ఫ్యాంటల్‌ సైనస్‌ బాధలకు ఉపయోగం. సాంగ్వినేరియా, క్యాల్కేరియా కార్చ్‌, మెర్క్‌సాల్‌, కాలిఐయిడ్‌, బెల్లడొనా మొదలగు హోమియో మందులు వాడదగినవి.

 
 
డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి
ఎండీ(హోమియో)
స్టార్‌ హోమియోపతి
ఫోన్‌ : 8977336677

www.starhomeo.com

email : [email protected]